Bengaluru: మరీ ఇంత దారుణమా.. మనవరాలి వయసున్న 15 మంది బాలికలపై ఆ టీచర్..
ఆ టీచర్ మనవరాలి వయసున్న చిన్నారులపై దాదాపు మూడు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారులు చివరికి..

అతను బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 54 సంవత్సరాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్.. శారీరక దృఢత్వం, వికాసం గురించి బోధించవలసిన ఆయనే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏదో ఒకరిద్దరి మీద కాదు.. దాదాపు 15 మంది విదార్థినీలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఆ టీచర్.ఆయన మనవరాలి వయసున్న చిన్నారులపై దాదాపు మూడు నెలల నుంచి ఈ అఘాయిత్యాలు చేస్తున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని ఆ విద్యార్థినులు తమలో తామే బాధపడ్డారు.
చివరికి తల్లిదండ్రులతోనే.. క్లాస్, మధ్యాహ్న భోజన సమయంలో శరీరం మీద అసభ్యంగా తాకుతూ ముద్ధులు పెట్టేవాడని చెప్పుకొని వాపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపిన ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఇదంతా నిజమేనని నిర్ధారించుకున్నాడు. తర్వాత స్థానికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బెంగళూరు నగర పరిధిలోని హెబ్బల్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 54 సంవత్సరాల అంజనప్ప ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. క్లాస్, మధ్యాహ్న భోజన వేళల్లో 8,9 తరగతుల విద్యార్థినుల శరీర భాగాలను తాకుతూ, ముద్దులు పెట్టేవాడు. మూడు నెలల నుంచి తన మనవరాలి వయసున్న దాదాపు 15 మంది బాలికలతో ఇదే రీతిలో ప్రవర్తించేవాడు.
ఎవరికి చెప్తే ఏం జరుగుతుందోనని భయపడిన ఆ విద్యార్థినులు తమతో తామే నచ్చచెప్పుకున్నారు. చివరాఖరికి తమ బాధలను వారి తల్లిదండ్రులకే చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన జరిపిన ప్రాథమిక విచారణ బాలికలపై అంజనప్ప లైంగిక వేధింపులకు పాల్పడడం నిజమేనని నిర్థారించుకున్నాడు. స్థానికి పోలీస్ స్టేషన్‌లో అంజనప్పపై స్కూల్ ప్రిన్సిపాల్ కంప్లెయింట్ చేశాడు. ‘‘మంగళవారం రాత్రి ప్రిన్సిపాల్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించాం. విషయం నిజమని తేలడంతో నిందితుడు అంజనప్పపై ఐపీసీ సెక్షన్ 354 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం’’ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దిలీస్ కుమార్ తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..




