South Central Railway: జులై 1 నుంచి 6 ప్రత్యేక రైల్లు రద్దు..! మరో 4 అందుబాటులోకి: దక్షిణ మధ్య రైల్వే

|

Jul 01, 2021 | 7:16 AM

రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో నడుపుతున్న రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరో ఆరు రైళ్లను జులై 1 నుంచి క్యాన్సిల్ చేస్తున్నట్లు పేర్కొంది.

South Central Railway: జులై 1 నుంచి 6 ప్రత్యేక రైల్లు రద్దు..! మరో 4 అందుబాటులోకి: దక్షిణ మధ్య రైల్వే
Scr Trains
Follow us on

Special Trains Cancel: రద్దీ తక్కువగా ఉన్న రూట్లతో నడుపుతున్న రైళ్లను రద్దు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరో ఆరు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రద్దు చేసిన రైళ్లలో.. విశాఖఫట్నం-కాచిగూడ, కాడిగూడ-విశాఖపట్నం, విశాఖపట్నం-కడప, కడప-విశాఖపట్నం, విశాఖపట్నం- లింగంపల్లి, లింగంపల్లి-విశాఖపట్నం రైళ్లు ఉన్నాయి. విశాఖపట్నం-కాడిగూడ రైలును జులై 1 నుంచి 14 వరకు, కాడిగూడ-విశాఖపట్నం రైలును జులై 2 నుచి 15 వరకు రద్దు చేయగా, విశాఖపట్నం-కడప రైలును జులై 1 నుంచి 14 వరకు, కడప-విశాఖపట్నం రైలును జులై 2 నుంచి 15 వరకు రద్దు చేసింది. అలాగే విశాఖపట్నం-లింగంపల్లి రైలును జులై 1 నుంచి 14 వరకు, లింగంపల్లి-విశాఖపట్నం రైలును జులై 2 నుంచి 15 వరకు రద్దు చేసింది. అయితే మరికొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతామని ప్రకటించింది. ప్రయాణికుల అవసరాల మేరకు ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్‌- అగర్తల రూట్ లో జులై 5, 12న, అగర్తల-సికింద్రాబాద్‌ రూట్ లో జులై 9, 16న ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే అగర్తల-బెంగళూరు కంటోన్మెంట్‌ రైలు జులై 6 నుంచి 24 వరకు ప్రతీ మంగళవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇదే రూట్ లో బెంగళూరు కంటోన్మెంట్‌-అగర్తల రైలు జులై 9 నుంచి 27 వరకు ప్రతీ శుక్రవారం నడవనుందని ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే తీపి కబురు చెప్పింది.

కాగా, హైదరాబాద్‌లో గురువారం నుంచి మరో 45 ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అయితే, ప్రస్తుతం కొన్ని రూట్లో రైళ్లను ప్రారంభిస్తున్న రైల్వేశాఖ.. మరికొన్న రూట్లతో మాత్రం రద్దు చేస్తోంది. అయితే, రానున్న థర్డ్ వేవ్ నేఫథ్యంలో పూర్తి స్థాయిలో రైళ్లను నడపాలా వద్దా అనే సందిగ్థంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో నష్టపోయిన రైల్వే శాఖ.. ముందుముందు ఎలాండి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Also Read:

Food Oil: సామాన్యులకు భారీ ఊరట.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Gold and Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధరలు.. అదే బాటలో వెండి ధరలు