ఐపీఎస్ కేడర్ అధికారుల డిప్యుటేషన్ పై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం, సుప్రీంకోర్టు

| Edited By: Anil kumar poka

Mar 01, 2021 | 5:33 PM

ఐపీఎస్ (కేడర్) రూల్స్ (1954) లోని చట్టబధ్దతను సవాలు చేస్తూ దాఖలైన 'పిల్' ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఐపీఎస్ కేడర్ అధికారుల డిప్యుటేషన్ పై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం, సుప్రీంకోర్టు
Follow us on

ఐపీఎస్ కేడర్ ఆఫీసర్ల డిప్యుటేషన్, ట్రాన్స్ ఫర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలను పక్కన బెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను కల్పించడానికి ఉద్దేశించిన ఐపీఎస్ (కేడర్) రూల్స్ (1954) లోని చట్టబధ్దతను సవాలు చేస్తూ దాఖలైన ‘పిల్’ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెంగాల్ కు చెందిన అబూ సోహెల్ అనే న్యాయవాది ఈ పిల్ వేశారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (కేడర్) రూల్స్ (1954) లోని రూల్ 6 (1) ని ఆయన సవాల్ చేశారు. ఐపీఎస్ కేడర్ అధికారుల బదిలీలు, డిప్యుటేషన్ల విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని పక్కన బెట్టేందుకు ఈ రూల్ కేంద్రానికి అధికారాలను కల్పిస్తోంది.  జస్టిస్ నాగేశ్వర రావు, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ లతో కూడిన బెంచ్ మొదట్లోనే ఈ పిల్ ని తిరస్కరించింది.  రూల్ 6 (1) అన్నది భారత రాజ్యాంగాన్ని, పబ్లిక్ పాలసీని అతిక్రమించేదిగా ఉందని అబూ సోహెల్ తన పిల్ లో పేర్కొన్నారు.ఈ నిబంధన ప్రకారం ఐపీఎస్ కేడర్ అధికారుల బదిలీలు, ట్రాన్స్ ఫర్ల విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో విభేదించిన పక్షంలో చివరకు కేంద్రమే తుది  నిర్ణయం తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది.సంబంధిత రాష్ట్రం కేంద్ర అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవలసి ఉంటుంది.

కాగా కేంద్రం తీసుకునే నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమవుతుందని, రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తుందని పిటిషనర్ అన్నారు. కానీ ఈ వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బెంగాల్ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యుటేషన్ పై పంపవలసిందిగా కోరుతూ  కేంద్ర హోమ్ శాఖ లోగడ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వం ఇందుకు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ మధ్య (డిసెంబరు)లో  బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటనలో ఉండగా ఆయన కాన్వాయ్ పై దాడి జరిగింది. ఆ సందర్భంలో  ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు  విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.  ఈ వ్యవహారంపై కేంద్రానికి, మమత ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

Jobs In HAL: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హులు వీరే.. చివరి తేది ఎప్పుడంటే..