SBI Zero Balance Accounts: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సర్వీస్ చార్జీల విషయంలో ఐఐటీ బాంబే ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం సంచలనంగా మారింది. జీరో బ్యాలెన్స్ ఖాతాల నుంచి 2015-2020 మధ్య రూ.300 కోట్లు సర్వీస్ ఛార్జీల రూపంలో బ్యాంకు వసూలు చేసినట్లు అధ్యయనం ద్వారా తేల్చింది. అయితే ఎస్‌బీఐ మాత్రమే కాదు.. ఇతర బ్యాంకులు కూడా ఇలా సేవల పేరుతో అత్యధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఐఐటీ బాంబే బట్టబయలు చేసింది. అయితే ఈ సర్వీస్ ఛార్జీల విషయంలో ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది.
జీరో బ్యాలెన్స్ అకౌంట్లు గల ఖాతాదారులు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల వినియోగించిన తర్వాత ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. 2016 జూన్ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఈ ఛార్జీలపై ఖాతాదారులకు ముందుగానే సమాచారం ఇస్తున్నామని ఎస్‌బీఐ వివరణ ఇచ్చుకుంది. అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు నెలలో నాలుగు ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు 2012 ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి ఇచ్చింది. అయితే అదనపు సేవలు పొందే స్వేచ్ఛ కస్టమర్లకు ఉంటుంది కాబట్టి ఉచిత లావాదేవీల తర్వాత ఛార్జీలు పెంచాల్సిందే అని పేర్కొంది. ఈ ఛార్జీల విషయంలో ఐఐటీ బాంబే బయటపెట్టడంతో ఎస్‌బీఐ క్లారిటీ ఇచ్చింది.
ఇవీ చదవండి: Covid-19: కరోనా నుంచి రక్షించుకునేందుకు కొత్త పాలసీలు..5 లక్షల వరకు కవరేజీ.. ప్రీమియం ఎంతంటే..!