Sanjay Raut: కోర్టులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు లభించని ఊరట.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

|

Sep 05, 2022 | 4:50 PM

పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన రాజ్యసభ సభ్యులు, శివసేన నాయకుడు సంజయ్ రౌత్(Sanjay Raut) జ్యుడీషియల్ కస్టడీని ముంబైలోని ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 19 వరకు పొడిగించింది. పాత్రా చాల్ మనీలాండరింగ్ కేసులో..

Sanjay Raut: కోర్టులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు లభించని ఊరట.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
Sanjay Raut
Follow us on

Siva Sena: పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన రాజ్యసభ సభ్యులు, శివసేన నాయకుడు సంజయ్ రౌత్(Sanjay Raut) జ్యుడీషియల్ కస్టడీని ముంబైలోని ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 19 వరకు పొడిగించింది. పాత్రా చాల్ మనీలాండరింగ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా.. సంజయ్ రౌత్ బెయిల్ కోసం ఇంకా పిటిషన్ దాఖలు చేయలేదని ఆయన తరపు న్యాయవాది సోమవారం కోర్టుకు తెలిపారు. సంజయ్ రౌత్ ను పట్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఆరు గంటల పాటు విచారించిన తర్వాత ఆగస్టు 1న ED అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడగించింది. దీంతో సెప్టెంబరు 19 వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుంది.

పాత్రాచాల్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. దీనిలో భాగంగానే ఆగస్టు 1న ఈడీ అధికారులు సంజయ్‌ రౌత్‌ను అరెస్టు చేశారు. తొలుత ఈడీ ఆయనను కస్టడీలోకి తీసుకోగా.. ఆ తర్వాత న్యాయస్థానం ఆయనను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. ఆ కస్టడీ సోమవారంతో ముగియడంతో సంజయ్ రౌత్‌ను కోర్టులో హజరుపర్చారు. ఈ కేసులో విచారణ ఇంకా పూర్తికానందున సంజయ్ రౌత్ జ్యుడీషియల్‌ కస్టడీని పొడగించాలని ఇటీవల కోర్టులో ఈడీ దరఖాస్తు చేసింది. దీంతో ఈడీ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం.. ఆయన కస్టడీని పొడగించింది. కస్టడీ సమయంలో సంజయ్‌ రౌత్‌ పార్లమెంట్‌ పత్రాలపై సంతకాలు చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఆ పత్రాల కాపీలను ఈడీ, కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఈరోజు ముంబైలోని ప్రత్యేక కోర్టు ముందుకు సంజయ్ రౌత్ ను హాజరుపర్చడంతో న్యాయస్థానం వద్దకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, మద్దతు దారులు భారీగా కోర్టు వద్దకు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..