ఇటీవల జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి వివాదంలోకి చిక్కుకున్న గాంధీ కుటుంబ అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ వెంటనే ఆమోదించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ దీనిపై సమాచారం ఇచ్చారు.
ట్విట్టర్ X లో పోస్ట్ చేసిన జైరామ్ రమేశ్, తన ఇష్టానుసారం శామ్ పిట్రోడా ఈ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే ఆమోదించారు అని జైరామ్ రమేశ్ వెల్లడించారు. సామ్ పిట్రోడా రాజీనామాకు గల కారణాలను జైరామ్ రమేష్ వెల్లడించలేదు.
श्री सैम पित्रोदा ने अपनी मर्ज़ी से इंडियन ओवरसीज कांग्रेस के अध्यक्ष पद से इस्तीफ़ा देने का फ़ैसला किया है। कांग्रेस अध्यक्ष ने उनका इस्तीफ़ा स्वीकार कर लिया है।
Mr. Sam Pitroda has decided to step down as Chairman of the Indian Overseas Congress of his own accord. The Congress…
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 8, 2024
అయితే, ఇటీవల వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కున్న ఆయన.. తన మాటలతో మరో కొత్త వివాదానికి తెరలేపారు. భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. జాతి వివక్షతో ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన రాజీనామా చేసినట్టు భావిస్తున్నారు. బుధవారం పిట్రోడా ప్రకటన వెలువడింది. అందులో అతను తూర్పు భారతీయులు చైనీస్ లాగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ ప్రజలలా కనిపిస్తారని చెప్పారు. అదేవిధంగా ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయుల మాదిరిగా ఉంటారని అన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో సహా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఏకంగా కలికిరి సభలో ప్రధాని మోదీ స్పందించారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అంటున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సీఎంలు సమర్థిస్తారా ? అని ప్రశ్నించారు. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని థాకరే వారసులుగా చెప్పుకునే వాళ్లు దీన్ని అంగీకరిస్తారా ? అని మోదీ నిలదీశారు. దేశాన్ని రివర్స్ గేర్‌లో తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే వారి లక్ష్యమని విమర్శించారు. కాంగ్రెస్ మదిలో విభజన ఆలోచనలే ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలోనే శామ్ పిట్రోడా రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.
శామ్ పిట్రోడా పూర్తి పేరు సత్యనారాయణ గంగారామ్ పిట్రోడా. టెక్నాలజీ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. 1974లో వెస్కామ్ స్విచింగ్ కంపెనీకి సహకారం అందించారు. మరుసటి సంవత్సరం 1975లో అతను ఎలక్ట్రానిక్ డైరీని కనిపెట్టడం ద్వారా తన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. తరువాతి నాలుగు సంవత్సరాలలో 580 DSS స్విచ్‌ను సృష్టించారు.దానిని 1978లో ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..