Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటు.. శనివారం రాత్రి ఘటన

Snake Bites Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటు.. శనివారం రాత్రి ఘటన
Salman Khan

Updated on: Dec 26, 2021 | 1:01 PM

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో సల్మాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే సల్మాన్‌ను విషం లేని పాము కాటేసినట్లు చెబుతున్నారు. కండల వీరుడు ఎలాంటి అస్వస్థతకు గురవ్వలేదని తెలుస్తోంది. పాము కాటు నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సల్మాన్ ఖాన్ నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని MGM (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఆదివారం ఉదయం 9 గంటలకు తన పన్వెల్ ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. కాగా డిసెంబర్ 27వ తేదీ సోమవారం సల్మాన్ ఖాన్ 56వ ఏట అడుగుపెట్టనున్నారు.

హిందీ బిగ్ బాస్ 15  వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో, కంటెస్టెంట్లతో కలిసి హోస్ట్ సల్మాన్ క్రిస్మస్‌తో పాటు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. RRR హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు దర్శకుడు SS రాజమౌళితో కలిసి ఆలియా భట్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ప్రొమోలో అలియా సల్మాన్ కోసం పుట్టినరోజు పాటను పాడటం చూడవచ్చు.  RRR సహనటులు ఆమెతో కలిసి వేదికపైకి వచ్చి సల్మాన్‌తో పుట్టినరోజు కేక్‌ను కట్ చేయించారు.

Also Read: దేశంలో న్యూ వేరియంట్‌ పంజా.. 459కి చేరిన కేసుల సంఖ్య

బెజవాడలో ఇంట్రస్టింగ్ సీన్.. వంశీ, రాధా భేటీ