
మరోసారి రాజస్థాన్ కాంగ్రెస్‌లో పోరు..సీఎం అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్‌గా మారింది..బీజేపీ హయంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ గెహ్లాట్‌ను ప్రశ్నించిన పైలట్.. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ దీక్ష చేపట్టారు. ఇదే చర్య అంటూ పార్టీ ప్రశ్నించినా పైలట్ వినిపించుకోకుండా దీక్ష చేస్తున్నారు.
పైలట్ నిరాహారదీక్ష సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జైపూర్‌లోని అమరవీరుల స్మారకం వద్ద పైలట్ నిరాహార దీక్ష జరుగుతోంది. అయితే గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ హయాంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేయడం ఇదే తొలిసారి. మరోవైపు పైలట్ తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
అశోక్ గెహ్లాట్ పై పోరును సచిన్ పైలట్ మరోసారి మొదలుపెట్టారు. 2018 వరకు అధికారంలో ఉన్న వసుంధర రాజే ప్రభుత్వ అవినీతి, మోసాలపై అశోక్ గెహ్లాట్ ఎందుకు మౌనం వహిస్తున్నారని పైలట్ ప్రశ్నించారు. ఆ స్కామ్‌లపై చర్యలు తీసుకోలేదన్న అంశాన్ని లేవనెత్తుతూ పైలట్ నిరాహారదీక్షను ప్రకటించారు. ఆయన చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
గత కొద్ది రోజులుగా రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌లోని సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సచిన్ పైలట్ నిరాహారదీక్షకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధిష్టానం హెచ్చరించినా లెక్కచేయకుండా దీక్ష చేయడం చర్చకు దారితీసింది.
— Sachin Pilot (@SachinPilot) April 11, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..