AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rozgar Mela: రోజ్‌గార్ మేళా.. 71,000 మంది అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వనున్న ప్రధాని..

రోజ్‌గార్ మేళా పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలు పొందిన 71,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 13 ఏప్రిల్, 2023 తేదీన ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

Rozgar Mela
Shiva Prajapati
|

Updated on: Apr 11, 2023 | 1:20 PM

Share

రోజ్‌గార్ మేళా పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలు పొందిన 71,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 13 ఏప్రిల్, 2023 తేదీన ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

‘రోజ్‌గార్ మేళా’.. ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం. రోజ్‌గార్ మేళా ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పని చేస్తుందని, యువతకు సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలాను అందించాలనే లక్ష్యంతో పని చేస్తుందని ప్రభుత్వం చెబుతుంది.

దేశవ్యాప్తంగా కొత్తగా రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, సీనియర్ డ్రాట్స్‌మన్, JE/పర్యవేక్షకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచర్, లైబ్రేరియన్, నర్సు, ప్రొబేషనరీ ఆఫీసర్లు వంటి వివిధ ఉద్యోగాలు/పోస్టులలో చేరనున్నారు. కాగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు ద్వారా శిక్షణ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!