Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. కుట్ర కోణం దాగి ఉందన్న రైల్వే మంత్రి!
కాన్పూర్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. బర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీన్ని కుట్రగా అభివర్ణించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
రైలు నంబర్ 19168 సబర్మతి ఎక్స్‌ప్రెస్ (బనారస్-అహ్మదాబాద్) అహ్మదాబాద్ వైపు వెళుతోంది. ఝాన్సీ డివిజన్ పరిధిలోని కాన్పూర్‌లోని భీమ్‌సేన్ సెక్షన్‌లోని గోవింద్‌పురి స్టేషన్ సమీపంలో, రైలు శుక్రవారం(ఆగస్ట్ 16) రాత్రి 2:30 గంటలకు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. దాంతో 22 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అలాగే ఎవరికీ గాయాలు అయినట్లు ఎటువంటి సమాచారం లేదు.
సబర్మతి ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ సమీపంలో ట్రాక్‌పై అడ్డంగా ఉంచిన బలమైన వస్తువును ఢీకొట్టింది. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉన్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. షార్ప్ హిట్ మార్కులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటికే సాక్ష్యాలు సేకరించామన్న మంత్రి, ఐబీ, యూపీ పోలీసులు విచారణ చేపట్టారన్నారు. ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణీకుల కోసం మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామన్నారు కేంద్ర మంత్రి. అధికారుల నివేదిక రాగానే చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
The engine of Sabarmati Express (Varanasi to Amdavad) hit an object placed on the track and derailed near Kanpur at 02:35 am today.
Sharp hit marks are observed. Evidence is protected. IB and UP police are also working on it.
No injuries to passengers or staff. Train arranged…
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 17, 2024
అయితే లోకో ఫైలట్ చెప్పిన వివరాల ప్రకారం, ప్రాథమికంగా బండరాయి ఇంజిన్‌ను ఢీకొట్టింది, దీని కారణంగా ఇంజిన్ తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత కోచ్ పట్టాలు తప్పింది. ఇదే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులను కాన్పూర్ సిటీకి బస్సులో పంపుతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న సీనియర్ అధికారులు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు, 22 బోగీలు పట్టాలు తప్పాయని, అయితే ఎవరికీ గాయాలు కాలేదని ఎడిఎం సిటీ కాన్పూర్ రాకేష్ వర్మ తెలిపారు. ప్రయాణికులందరినీ కాన్పూర్ స్టేషన్‌కు బస్సుల ద్వారా పంపుతున్నారు. మెమో రైలు కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం విశేషం.
రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లుః
నగరం | హెల్ప్‌లైన్ నంబర్ |
ప్రయాగ్రాజ్ | 0532-2408128, 0532-2407353 |
కాన్పూర్ | 0512-2323018, 0512-2323015 |
మీర్జాపూర్ | 054422200097 |
ఇతావా | 7525001249 |
తుండ్ల | 7392959702 |
అహ్మదాబాద్ | 07922113977 |
బనారస్ సిటీ | 8303994411 |
గోరఖ్పూర్ | 0551-2208088 |
ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దు..!
ఈ ప్రమాదం తర్వాత కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రూట్లను మార్చారు.
రద్దు చేసిన రైళ్ల సమాచారం
- 01823/01824 (V ఝాన్సీ-లక్నో) JCO 17.08.24
- 11109 (V ఝాన్సీ-లక్నో జంక్షన్) JCO 17.08.24
- 01802/01801 (కాన్పూర్-మాణిక్‌పూర్) JCO 17.08.24
- 01814/01813 (కాన్పూర్-V ఝాన్సీ) JCO 17.08.24
- 01887/01888 (గ్వాలియర్-ఎటావా) JCO 17.08.24
- 01889/01890 (గ్వాలియర్-భింద్) JCO 17.08.24
దారి మళ్లించిన రైళ్ల వివరాలుః
రైలు | కొత్త మార్గం |
11110 (లక్నో జంక్షన్-V ఝాన్సీ) JCO | గోవింద్‌పురి-ఎటావా-భింద్-గ్వాలియర్-వి ఝాన్సీ |
22537 (గోరఖ్‌పూర్-లోకమాన్య తిలక్ టెర్మినల్) JCO | గోవింద్‌పురి-ఎటావా-భింద్-గ్వాలియర్-వి ఝాన్సీ |
20104 (గోరఖ్‌పూర్-లోకమాన్య తిలక్ టెర్మినల్) JCO | కాన్పూర్-ఎటావా-భింద్-గ్వాలియర్-వి ఝాన్సీ |
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…