Macherla: అన్నా క్యాంటీన్ ముందు అదో మాదిరి వాసన.. పరిశీలించగా షాక్

గత వైసీపీ హయాంలో మూతపడిన అన్నా క్యాంటీన్స్.. కూటమి ప్రభత్వం రూలింగ్‌లోకి వచ్చాక రీ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ క్యాంటీన్స్ అందుబాటులో ఉన్నాయి. అలానే మాచర్ల టౌన్‌లో కూడా అన్నా క్యాంటీన్ ఉంది. రోజూ వందల మంది పేదలకు అక్కడికి వచ్చి పొట్ట నింపుకుంటూ ఉంటారు. అయితే...

Macherla: అన్నా క్యాంటీన్ ముందు అదో మాదిరి వాసన.. పరిశీలించగా షాక్
Ganja Plant
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 23, 2024 | 7:19 AM

గతంలో టీడీపీ హయాంలో పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్స్.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడ్డాయి. ఇటీవల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన అన్నా క్యాంటీన్స్ పున:ప్రారంభించారు. ఐదు రూపాయలకే పేదలకు అల్పాహారం, ఆహారం అందిస్తున్నారు. దీంతో పూట కూడా గడవని పేదలు.. అన్నా క్యాంటీన్లలోనే కడుపు నింపుకుంటున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి సప్లై, వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. ఏపికి చెడ్డ పేరు తీసుకొస్తున్న గంజాయిని కూకటి వేళ్లతో పెకలిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈగిల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే అనూహ్యంగా అన్నా క్యాంటిన్ ముందే గంజాయి మొక్క పెరగటం కలకలం రేపింది.

మాచర్ల పట్టణంలోని ఆర్ అండ్ బి కార్యాయలం ఎదుట అన్నా క్యాంటిన్ ఉంది. అన్నా క్యాంటిన్ మూడు నెలల క్రితం ప్రారంభించారు. దాన్ని సుందరంగా తీర్చి దిద్దారు. ఇందులో భాగంగా అన్నా క్యాంటిన్ ముందు మొక్కలు పెంచుతున్నారు. అయితే ఆదివారం కొంతమందికి డౌట్ వచ్చి చూడగా ఆ మొక్కల్లో గంజాయి మొక్క పెరుగుతోంది. గంజాయి మొక్క చూడటానికి బంతి పువ్వు మొక్కలా ఉంటుంది. దీంతో అందరూ దాన్ని బంతి మొక్కే అనుకుంటూ వచ్చారు. అయితే అనుమానం వచ్చి చూడగా అది గంజాయి మొక్కగా తేలింది. దాని ఆకులు కూడా తుంచినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో మరింత డౌట్ పెరగడంతో.. నిర్వాహకులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు.

పోలీసులు క్యాంటిన్ వద్దకు వచ్చి పరిశీలించి మొక్కను స్టేషన్ తరలించారు. అయితే ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా అక్కడ మొక్క నాటారా లేక గతంలో మూతపడి ఉన్న సమయంలో ఎవరైనా గంజాయి సేవించిన వాళ్లు పడేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అన్నా క్యాంటిన్ వద్ద గంజాయి మొక్క పెరగడం మాచర్ల పట్టణంలో టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది.

Ganja Plant

Ganja Plant

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..