Rain Alert: అస్తవ్యస్తంగా తీవ్ర అల్పపీడనం కదలికలు.. గురువారం వరకు ఏపీలో భారీ వర్షాలు

Weather Today: తీవ్ర అల్పపీడనం ప్రభావంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడన ప్రయాణం అస్తవ్యస్తంగా సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం బలహీనపడిందని భావించినా.. పశ్చిమ గాలుల ప్రభావంతో కదలికలను అంచనా వేయడం కష్టతరమవుతున్నట్లు తెలుస్తోంది.

Rain Alert: అస్తవ్యస్తంగా తీవ్ర అల్పపీడనం కదలికలు.. గురువారం వరకు ఏపీలో భారీ వర్షాలు
Andhra Weather Report
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 23, 2024 | 8:03 AM

ఏమో.. ఏంటో కానీ.. ఈ ఏడాది ఏపీని వర్షాలు అల్లాడిస్తున్నాయి. అల్పపీడనాలు, తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎప్పుడు ముసురు పట్టి పంటలు నాశనం అవుతాయో అని రైతులు అనునిత్యం ఆందోళన చెందుతున్నారు. తాజాగా పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం టెన్షన్ పెడుతోంది. దీని ప్రభావంతో.. సోమవారం నుంచి గురువారం వరకు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సముద్ర తీర ప్రాంతాల్లో 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. దీంతో ముందు జాగ్రత్తగా పోర్టల వద్ద 3వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. నేటి నుంచి గురువారం వరకు వేటకు వెళ్లొద్దని జాలర్లకు సూచించారు.

తీవ్ర అల్పపీడనం ప్రయాణం అంచనా వేయడం కష్టతరంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం.. పూర్తిగా బలహీన పడుతుందని భావించారు. కానీ అల్పపీడన ప్రయాణం గందరగోళంగా ఉండటంతో.. కదలికలను అంచనా వేయడం కష్టతరంగా మారింది. తాజాగా అల్పపీడన అవశేషాలు.. ఆంధ్రాలోని దక్షిణ కోస్తా, తమిళనాడువైపు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుందంటున్నారు. అయితే అల్పపీడనం తీరం దాటుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..