Russia Ukraine ISRO: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌.. అదే జరిగితే ఇస్రోకు ఇబ్బందులు తప్పవా?

Russia Ukraine ISRO: ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌ ఇస్రోపై పడుతుందా? మన అంతరిక్ష ప్రయోగాలకు ఆటంకాలు తప్పవా? అంటే పరిస్థితులు అవుననే..

Russia Ukraine ISRO: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌.. అదే జరిగితే ఇస్రోకు ఇబ్బందులు తప్పవా?
Isro

Updated on: May 22, 2022 | 9:53 AM

Russia Ukraine ISRO: ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌ ఇస్రోపై పడుతుందా? మన అంతరిక్ష ప్రయోగాలకు ఆటంకాలు తప్పవా? అంటే పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. యుద్ధం విషయంలో ప్రపంచ దేశాలు ఎంత వారించినా.. ఎలా హెచ్చరించినా.. పట్టించుకోలేదు రష్యా. ఉక్రెయిన్‌పై భీకరంగా విరుచుకుపడింది. యుద్ధం మొదలై రెండు నెలలు దాటిపోయింది. ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియదు. ఈ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా కనిపిస్తూనే ఉంది. రష్యాపైన ఆంక్షలతో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నిర్వహణ విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాముల్ని తీసుకువెళ్లేందుకు అవసరమైన రాకెట్లను రష్యానే సప్లై చేస్తోంది. దీంతో పాటు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ చేపట్టే చాలా ప్రయోగాలకు కూడా రష్యానే రాకెట్లు సరఫరా చేస్తూ వచ్చింది. ఇదే రష్యా ఎక్విప్‌మెంట్‌, టెక్నాలజీ ఇన్‌పుట్స్‌ అందిస్తున్న ఇతర విభాగాల్లోనూ చిక్కులు వచ్చే ప్రమాదం లేకపోలేదు.

అలా చూసినప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రోకు, ఇండియన్‌ ఏరోస్పేస్‌ రంగంలో ఉన్న సంస్థలకు కూడా ఈ వార్‌ ఎఫెక్ట్‌ తప్పేట్టు లేదు. ముఖ్యంగా కాస్మోనాట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌కు ఆటంకం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో రష్యా సహకారం తీసుకుంటోంది. ఈ ట్రైనింగ్‌కు అంతరాయం ఏర్పడితే ఇస్రో ప్లాన్‌ చేస్తున్న మానవ సహిత అంతరిక్ష యాత్రలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఇస్రోకు స్పేస్‌ సూట్స్‌, ఇతర ఎక్విప్‌మెంట్‌ సరఫరా, హేబిటబుల్‌ క్యాప్సూల్స్‌, స్పేస్‌ మెడిసిన్‌లో శిక్షణ విషయంలో రష్యా కీలకంగా వ్యవహరిస్తోంది. అలాగే క్రయోజనిక్‌ రాకెట్‌ టెక్నాలజీ అభివృద్ధిలో కూడా రష్యా సహకారం అందిస్తోంది.