Bengal Assembly Fights: బెంగాల్ అసెంబ్లీలో తన్నులాట.. టీఎంసీ-బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ
బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. బీర్‌భూమ్ హింసపై రగడ జరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ , బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో ఇద్దరు ఎమ్మెల్యేలకు తీవ్రగాయాలయ్యాయి.
బెంగాల్ అసెంబ్లీ (Bengal Assembly )రణరంగాన్ని తలపించింది. బీర్‌భూమ్ హింసపై(Birbhum violence) రగడ జరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ , బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో ఇద్దరు ఎమ్మెల్యేలకు తీవ్రగాయాలయ్యాయి. టీఎంసీ ఎమ్మెల్యే అసిద్ మజుందార్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ టిగ్గా చొక్కా చినిగిపోయింది. అసెంబ్లీలో భీర్‌భూమ్ ఘటనపై దర్యాప్తుకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సభలో గొడవ చేశారని స్పీకర్ బీజేపీ పక్ష నేత సువేందు అధికారితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. తమను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభ బయట ఆందోళన చేశారు.
ఇటీవల బీర్‌భూం జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టారు బీజేపీ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని వారు ప్రశించారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను తృణమూల్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రెండు పార్టీల ఎమ్మెల్యేలపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Absolute pandemonium in the West Bengal Assembly. After Bengal Governor, TMC MLAs now assault BJP MLAs, including Chief Whip Manoj Tigga, as they were demanding a discussion on the Rampurhat massacre on the floor of the house.
What is Mamata Banerjee trying to hide? pic.twitter.com/umyJhp0jnE
— Amit Malviya (@amitmalviya) March 28, 2022
బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు. ఇది కాస్తా టెన్షన్‌గా మారింది. ఎమ్మెల్యేలు పరస్పరం తోసుకోవడం.. దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ‘
మరోవైపు ఘటన నేపథ్యంలో ఐదుగురు బీజేపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సువేందు అధికారి, మనోజ్ టిగ్గా, నరహరి మహతో, శంకర్ ఘోష్, దీపర్ బర్మాన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మార్చి 21న బీర్‌భూం జిల్లాలో బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే రామ్‌పుర్‌హాట్ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు. భాదు షేక్ హత్యతో ప్రత్యర్థు ఇళ్లకు టీఎంసీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హత్యకు ముందు వారిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కలకత్తా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే తృణమూల్ నేత సహా 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి: Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..
Summer Skin Care: కేవలం 15 రోజుల్లో మెరిసిపోయే అందం మీ సొంతం.. జస్ట్ ఈ చిట్కాలు మీ కోసం..