రైతు కొడుకును పెళ్లి చేసుకుంటే వధువుకు రూ.2 లక్షలు.. ఎక్కడంటే..?

|

Apr 11, 2023 | 5:23 PM

రైతు కొడుకులను వివాహం చేసుకునే మహిళలకు రూ. 2 లక్షలు ఇస్తానని జేడీ నేత హెచ్‌డీ కుమారస్వామి హామీ ఇచ్చారు. కోలార్‌లో జరిగిన 'పంచరత్న' ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు వింత ప్రకటన చేశారు. ఈ ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల-2023 ల నేపథ్యంలో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా..

రైతు కొడుకును పెళ్లి చేసుకుంటే వధువుకు రూ.2 లక్షలు.. ఎక్కడంటే..?
Kumaraswamy poll promises
Follow us on

రైతు కొడుకులను వివాహం చేసుకునే మహిళలకు రూ. 2 లక్షలు ఇస్తానని జేడీ నేత హెచ్‌డీ కుమారస్వామి హామీ ఇచ్చారు. కోలార్‌లో జరిగిన ‘పంచరత్న’ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు వింత ప్రకటన చేశారు. ఈ ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల-2023 ల నేపథ్యంలో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారం జోరందుకొంది. ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన శైలిలో ఆయా పార్టీల నేతలు హామీలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా కోలారోలో జరిగిన ర్యాలీలో కుమార స్వామీ మాట్లాడుతూ.. ‘రైతు బిడ్డలను వివాహం చేసుకునేందుకు ఆడపిల్లలు సిద్ధంగా లేరని పేర్కొంటూ నాకు వినతి పత్రం అందింది. రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు యువతులకు రెండు లక్షల రూపాయలు నజరానా ఇస్తాం. మన అబ్బాయిల ఆత్మగౌరవం కాపాడేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నాం’ అని అన్నారు.

ఇదిలా ఉండగా కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 93 మంది అభ్యర్థులను ప్రకటించిన జేడీఎస్‌ టికెట్ల పంపిణీపై అంతర్గతంగా నెలకొన్న కలహాలకు ముగింపు పలకాలని భావిస్తోంది. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణకు హాసన్ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్‌ ఇవ్వడంపై వివాదం నెలకొంది. ఐతే ఆమెకు టిక్కెట్లు ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సుముఖంగా లేరు.

దేవెగౌడ ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయగా, సమావేశం ప్రారంభమైన 15 నిమిషాలకే భవాని రేవణ్ణ వాకౌట్ చేశారు. హాసన్ టిక్కెట్‌పై ఇరువర్గాలు పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ ఇప్పటి వరకు జాబితా విడుదల చేయనేలేదు. కాంగ్రెస్‌ ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది. కర్ణాటకలో ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారంగా మే 10వ తేదీన ఒకే విడతలో కర్ణాలక రాష్ట్రం మొత్తం పోలింగ్‌ జరగనుంది. ఫలితాలను మే 13న ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.