#WATCH: కదులుతున్న రైలు ఎక్కుతూ పడిపోయిన దివ్యాంగుడు.. రెప్పపాటులో ప్రాణాలను కాపాడిన ఆర్‌పీఎఫ్ జవాన్..

|

Feb 06, 2021 | 12:16 PM

Maharashtra - Panvel station: ప్రయాణికులు కదులుతున్న రైలును ఎక్కుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తునే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో..

#WATCH: కదులుతున్న రైలు ఎక్కుతూ పడిపోయిన దివ్యాంగుడు.. రెప్పపాటులో ప్రాణాలను కాపాడిన ఆర్‌పీఎఫ్ జవాన్..
Follow us on

Maharashtra – Panvel station: ప్రయాణికులు కదులుతున్న రైలును ఎక్కుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తునే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో మరొకటి చోటుచేసుకోగా.. రైల్వే పోలీసు అప్రమత్తమై దివ్యాంగుడి ప్రాణాలను కాపాడాడు. మహారాష్ట్రలోని పాన్వెల్ రైల్వే స్టేష‌న్‌లో శుక్రవారం ఓ రైలు వేగంగా క‌దులుతుండగా.. దానిని ఎక్కేందుకు ఓ దివ్యాంగుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని కాలు జారింది. దీంతో అతను ఫ్లాట్‌ఫాం – రైలు మ‌ధ్య ప‌డిపోతుండగా.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రైల్వే పోలీసు అప్రమత్తమై దివ్యాంగుడి ప్రాణాల‌ను రెప్పపాటులో కాపాడాడు. శుక్రవారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో సీసీ టీవీలో రికార్డయిన ఈ సంఘటన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనే 30న మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వేస్టేషన్‌లో కూడా జరిగిన విషయం తెలిసిందే.

Also Read:

IRCTC Launches: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్ బస్ బుకింగ్ సేవలను ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ

Chakka Jam: ‘చక్కా జామ్’ అలర్ట్… దేశ రాజధానిలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత.. డ్రోన్లతో పర్యవేక్షణ