రానే వచ్చిందిఅది మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్. ప్రయాణికులంతా ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే అటు వైపున్న ఓ ప్యాసింజర్ ఇవతలి ప్లాట్‌ఫాం మీదకు వచ్చేందుకు పట్టాలు దాటుతున్నాడు. ఇంతలోనే ట్రైన్ . ఐతే ఓ మెరుపులా వచ్చిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అనిల్‌కుమార్ ఏ మాత్రం ఆలోచించలేదు. తనకేమవుతుందోనని చూడలేదు. ప్రాణాలకు తెగించి మరీ ఆ వ్యక్తిని ప్లాట్‌ఫాం పైకి నెట్టేశాడు. వెంటనే తాను కూడా అటువైపు దూకి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.ఈ ఘటన రైల్వేస్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రమాదం ముంచుకొస్తున్న వేళ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడటంతో పాటు తనను తాను సేవ్ చేసుకున్న కానిస్టేబుల్‌ను రియల్ హీరో అని కొనియాడుతున్నారు స్థానికులు. అతని తెగువ, ధైర్యం చూసి ప్రశంసల జల్లు
కురిపిస్తున్నారు.
#WATCH: RPF Constable Anil Kr, deployed at Thane Railway Station, risked his life to save a man who was crossing the railway track while a train was coming towards him. Kumar jumped onto the track, hauled the man up the platform&then managed to jump out of the train’s way.(03.12) pic.twitter.com/Y7sNucBzse
— ANI (@ANI) December 5, 2019