నా నియోజకవర్గంలో రోడ్లు ఆ బ్యూటీ బుగ్గల్లా ఉండాలి.. క్రేజీ కామెంట్‌ చేసిన మంత్రి.. ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..

|

Nov 24, 2021 | 6:00 PM

ఇటీవల రాజస్థాన్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర గూడా అప్పుడే వివాదంలో చిక్కుకున్నారు. మంత్రిగా నియమితులయ్యాక

నా నియోజకవర్గంలో రోడ్లు ఆ బ్యూటీ బుగ్గల్లా ఉండాలి.. క్రేజీ కామెంట్‌ చేసిన మంత్రి.. ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..
Follow us on

ఇటీవల రాజస్థాన్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర గూడా అప్పుడే వివాదంలో చిక్కుకున్నారు. మంత్రిగా నియమితులయ్యాక మొదటిసారి తన నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా రహదారులను బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ బుగ్గలతో పోల్చడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై పలువురు మండిపడుతున్నారు.

గతంలో లాలూ కూడా…

కాగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆదివారం తన క్యాబినేట్‌ను పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా 15 మందికి క్యాబినేట్‌లో చోటు కల్పించారు. అందులో రాజేంద్ర గూడా ఉన్నారు. ఆయనకు పంచాయతీరాజ్‌శాఖ పోర్ట్‌ ఫోలియోను కేటాయించారు. కాగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గం ఉదయ పూర్వాటిలో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా తమ గ్రామాల్లోని రహదారులు బాగు చేయాలని కొందరు మంత్రిని కోరారు. అప్పుడు రాజేంద్ర పబ్లిక్‌ వర్స్స్‌ డిపార్ట్‌మెంట్ చీఫ్‌ ఇంజినీర్‌ వైపు చూస్తూ ‘నా నియోజకవర్గంలో రహదారులు కత్రినా బుగ్గల్లా ఉండాలి’ అని సరదాగా వ్యాఖ్యానించారు. మొదట కత్రినా కైఫ్‌ పేరుకు బదులు కేట్‌ కైఫ్‌ అని పేరును ఉచ్చరించారు మంత్రి. అయితే పక్కనున్న వారు వారించడంతో కత్రినా కైఫ్‌ పేరును పలికారు. మంత్రిగారి మాటలకు అక్కడున్న ప్రజల్లో కొందరు చప్పట్లు కొట్టడం గమనార్హం. ఆయన సరదాగా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ‘బిహార్‌ రోడ్లు హేమమాలిని బుగ్గల్లా నున్నగా ఉండాలి’ అని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు.

GDP: పరుగులు తీయనున్న భారత్ జీడీపీ.. ప్రపంచ స్థాయి సంస్థల అంచానా.. ఏ సంస్థ ఎంత అంచనా వేస్తోందంటే..

ఇప్పటికే అల్లాడిపోతున్న దేశ ప్రజలకు మరో షాక్.. పెరగనున్న టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజరేటర్ల ధరలు

Kangana Ranaut: ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై కంగనా రియాక్షన్‌.. మరో వివాదాస్పద పోస్ట్‌ పెట్టిన బాలీవుడ్‌ క్వీన్‌..