ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటెయినర్ ఢీ కొట్టడంతో పేలిన కారు.. ఐదుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై

  • Updated On - 9:51 am, Tue, 22 December 20
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటెయినర్ ఢీ కొట్టడంతో పేలిన కారు.. ఐదుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగాలాండ్ అతి వేగంగా వస్తున్న ఓ కంటెయినర్ రాంగ్ రూట్ నుంచి కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో కారు ప్యూయల్ ట్యాంక్ పేలిపోయి మంటలు చెలరేగాయి. అందులో కాలిపోతున్న వ్యక్తుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా మంటల్లో తగలబడిపోయింది. కాగా ఆ కంటెయినర్ కూడా రోడ్డు పక్కనే ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.