Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-బస్సు ఢీ.. చిన్నారి సహా ఆరుగురు మృతి

|

Jun 05, 2023 | 9:08 AM

నాగ్‌భిడ్‌కు 17 కి.మీ దూరంలోని కాన్పా గ్రామంలో జరిగినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఓ కారులో ఆరుగురు ప్రాణిస్తున్నారని..  వారు నాగ్‌పూర్‌ నుంచి నాగ్‌భీడ్‌ వైపు వెళ్తున్నారని తెలిపారు. కారు ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొట్టింది.

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-బస్సు ఢీ.. చిన్నారి సహా ఆరుగురు మృతి
Road Accident In Maharastra
Follow us on

మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నాగ్‌పూర్‌ నుంచి నాగ్‌భిడ్‌ వైపు వెళ్తున్న ఓ కారు ప్రైవేట్‌ బస్సును ఢీ కొట్టడంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఢీ కొనడంతో కారు ముందు భాగం భిన్నాభిన్నమైంది. అదే సమయంలో, ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఒకరు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యలో మరణించగా..  మరొకరు చికిత్స పొందుతూ కన్నుమూశారు.

చంద్రాపూర్ జిల్లాలోని నాగ్‌భిడ్-నాగ్‌పూర్ రోడ్డులోని కాన్పా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలం వద్ద ఉన్న స్థానికులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం గ్రామీణ ఆసుపత్రికి తరలించారు.

మీడియా కథనాల ప్రకారం, ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో నాగ్‌భిడ్‌కు 17 కి.మీ దూరంలోని కాన్పా గ్రామంలో జరిగినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఓ కారులో ఆరుగురు ప్రాణిస్తున్నారని..  వారు నాగ్‌పూర్‌ నుంచి నాగ్‌భీడ్‌ వైపు వెళ్తున్నారని తెలిపారు. కారు ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి

ఆరుగురు దుర్మరణం
కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. వాహనాన్ని కట్ చేసి వారి మృతదేహాలను బయటకు తీసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. గాయపడిన మరో వ్యక్తి నాగ్‌భిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతులు రోహన్ విజయ్ రౌత్ (30), రిషికేష్ విజయ్ రౌత్ (28), ప్రభా శేఖర్ సోనవానే (35), లఖ్నీ, గీతా విజయ్ రౌత్ (50), సునీతా రూపేష్ ఫెండర్ (40) నాగ్‌పూర్‌కు చెందిన యామిని.(9) లుగా గుర్తించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..