ఇక ఆపేద్దాం అంటూ భారత్‌ ముందు కాళ్లబేరం.. నేషనల్‌ కమాండ్‌ అథారిటీ సమావేశం రద్దు చేసుకున్న పాక్

ప్రస్తుతం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం కానీ యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులపై దాడి చేస్తే.. పాక్‌ ఏకంగా యుద్ధానికి కాలు దువ్వుతూ.. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అది సరిపోదన్నట్లు ఫైటర్‌ జెట్లతో డ్రోన్లతో క్షిపణులతో

ఇక ఆపేద్దాం అంటూ భారత్‌ ముందు కాళ్లబేరం.. నేషనల్‌ కమాండ్‌ అథారిటీ సమావేశం రద్దు చేసుకున్న పాక్
Pakistan Nuclear And Pm She

Edited By:

Updated on: May 10, 2025 | 12:56 PM

ప్రస్తుతం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం కానీ యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులపై దాడి చేస్తే.. పాక్‌ ఏకంగా యుద్ధానికి కాలు దువ్వుతూ.. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అది సరిపోదన్నట్లు ఫైటర్‌ జెట్లతో డ్రోన్లతో క్షిపణులతో భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నిస్తోంది. వీటన్నింటిని ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికోడుతోంది. దీంతో ఇక ఆపేద్దాం అంటూ భారత్‌ ముందు పాక్‌ కాళ్లబేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. భారత్‌ దూకుడుతో సీన్‌ మారిపోయింది. ఉద్రిక్తతలు తగ్గించుకుందామని భారత్‌కు సంకేతాలు పంపుతోంది పాక్.

ఈ క్రమంలోనే పాక్‌ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో విదేశాంగమంత్రి ఇషాక్‌దార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒత్తిడి, పౌరుల నుంచి వ్యతిరేకతతో పాక్ యూటర్న్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. నేషనల్‌ కమాండ్‌ అథారిటీ సమావేశం రద్దు చేసుకుంది. అమెరికా సహా పలుదేశాల నుంచి పాక్‌పై ఒత్తిడి వస్తోంది. అలాగే భారత్‌కు ప్రపంచదేశాల మద్దతు పెరుగుతోంది. అటు పాక్‌ దాడులను తిప్పికొట్టడంలో తగ్గేది లేదన్నారు జైశంకర్‌. శాంతి నెలకొల్పడంలో భారత్‌ ముందుంటుందన్నారు. ఇప్పటికే పాక్‌ దుశ్చర్యలను ప్రపంచం ముందుంచింది భారత్‌.
అలాగే భారత్‌-పాక్‌ చర్చించుకోవాలని అమెరికా కోరుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..