ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా..?

|

Jul 21, 2020 | 4:16 PM

ఇండియన్ రైల్వే..అత్యంత పొడవైన ఈ రైలు మార్గం ఓ అద్భుతమని చెప్పవచ్చు..మన రైల్వే ఘనత ఎనలేనిది. ఇప్పటికే ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన మన రైల్వేశాఖ తాజాగా మరో భారీ ప్రాజెక్టును అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు పనులు కొనసాగిస్తోంది.

ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసా..?
Follow us on

ఇండియన్ రైల్వే..అత్యంత పొడవైన ఈ రైలు మార్గం ఓ అద్భుతమని చెప్పవచ్చు..మన రైల్వే ఘనత ఎనలేనిది. ఇప్పటికే ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన మన రైల్వేశాఖ తాజాగా మరో భారీ ప్రాజెక్టును అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు పనులు కొనసాగిస్తోంది. రిషికేశ్-కర్ణ్‌ప్రయాగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు కింద తలపెట్టిన రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి.

 

2024-25 నాటికి పనులు పూర్తయ్యేలా ప్ర‌ణాళిక రూపొందించారు. 125 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గంలో మొత్తం 12 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. కాగా, ఉత్తరాఖండ్ పరిధిలోని రిషికేశ్ రైల్వే స్టేషన్లకు సంబంధించిన కొన్ని ఫోటోలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ షేర్ చేశారు. ఇలాంటి స్టేషన్‌ను ఎప్పుడూ చూసివుండరు..ఈ రిషికేషన్ స్టేషన్ అందాలను మీకు చూపించాలనుకుంటున్నానని పియూష్ గోయల్ ట్విట్ చేశారు.