Rahul Gandhi: ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలు.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Jan 23, 2023 | 8:13 AM

చిన్నప్పటి విషయాలు, చదువు సాగిన విధానం, పెళ్లి గురించిన అభిప్రాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశాలపై కీలక విషయాలు చెప్పారు. ముఖ్యంగా పెళ్లి గురించి.. తన అభిప్రాయమేంటో చెప్పేశారు.

Rahul Gandhi: ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలు.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Rahul Gandhi
Follow us on

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అగ్రనేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. మరి ఆయన బాల్యం, విద్యాభ్యాసం ఎలా గడిచింది..? పెళ్లి గురించి అసలు ఎలాంటి ఆలోచన ఉంది..? లాంటి కీలక విషయాల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. అలాంటి వాటన్నింటి గురించి రాహుల్ గాంధీ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూను తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తన చిన్ననాటి ఊసుల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై రాహుల్ గాంధీ ఇందులో బదులిచ్చారు.

తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ అంటే ఎంతో ప్రేమని, తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు రాహుల్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘‘ఇది ఆసక్తికర ప్రశ్న.. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

ఏమైనా చెక్ లిస్ట్ మీదగ్గర ఉన్నాయా..? అంటూ అడిగిన ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. ‘‘ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలు.. మా అమ్మానాన్నది ప్రేమ వివాహం.. కాబట్టి అమ్మాయి విషయంలో ఎక్కువ అంచనాలు పెట్టుకుంటా.. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు’’ అంటూ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. సరైన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానంటూ పేర్కొన్నారు.

నాన్ వెజ్ అంటే రాహుల్‌కి ఎంతో ఇష్టం.. తెలంగాణ ఫుడ్ స్పైసీగా ఉంటుందన్నారు. తనకు కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్. కానీ వాటికి వచ్చే రిపేర్‌పై అవగాహన ఉందన్నారు. పొలిటికల్‌గా తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనన్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తనను దూషించడం, దుర్భషలాడటం లాంటివి చేస్తుంటారన్నారు. ఎన్ని తిట్టినా, ఎన్ని పేర్లు పెట్టినా తనదైన స్టైల్‌లో ముందుకెళ్లడమే తన లక్షణమని రాహుల్ వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..