Woman Cricketer: క్రికెట్ రంగంలో తీవ్ర విషాదం.. మహిళా క్రికెటర్ ఫారెస్ట్‌లో అనుమానాస్పద మృతి..!
భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒడిశా మహిళా క్రికెట్ క్రీడాకారిణి రాజశ్రీ స్వయిన్ మృతదేహం కటక్ సమీపంలోని గురుడు జట్టుయ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఒక చెట్టుకు వేలాడుతుండగా
భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒడిశా మహిళా క్రికెట్ క్రీడాకారిణి రాజశ్రీ స్వయిన్ మృతదేహం కటక్ సమీపంలోని గురుడు జట్టుయ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఒక చెట్టుకు వేలాడుతుండగా శుక్రవారం పోలీసులు గుర్తించారు. డీసీపీ పీనాక్ మిశ్రా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుంచి రాజశ్రీ కనిపించడం లేదని, ఆమె తల్లిదండ్రులు మంగళబాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించిందన్నారు. అసహజ మరణంగా కేసు నమోదు చేశామన్నారు. తమ కుమార్తెను ఎవరో హత్య చేశారని రాజశ్రీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని వారు చెబుతున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం.. ఈ నెల 18 నుంచి పూడుచూరులో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళా క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ 25 మందిని ఎంపిక చేసింది. వీరికి బజరకుబట్టి ప్రాంతంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. రాజశ్రీ అందులో పాల్గొంది. 11న తండ్రి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరి తిరిగి కనిపించలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

