ఫోర్టిఫైడ్ బియ్యం తింటే కాలేయ సమస్యలు వస్తాయా?.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు
వివిధ ప్రభుత్వ ఆహార పథకాలకు పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్ (fortification rice) బియ్యం సురక్షితం కాదని ఓ నివేదిక వెల్లడించింది. గ్రీన్ పీస్ చే రూపొందిన వాస్తవ-నిర్ధారణ నివేదికలో ఫోర్టిఫికేషన్ ప్రభావవంతగా లేదని నిరూపితమైంది. గతేడాది....

వివిధ ప్రభుత్వ ఆహార పథకాలకు పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్(fortification rice) బియ్యం సురక్షితం కాదని ఓ నివేదిక వెల్లడించింది. గ్రీన్ పీస్ చే రూపొందిన వాస్తవ-నిర్ధారణ నివేదికలో ఫోర్టిఫికేషన్ ప్రభావవంతగా లేదని నిరూపితమైంది. గతేడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు పథకాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యాన్ని వచ్చే మూడేళ్లలో అంటే 2024 నాటికి బలపరుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రకటించారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని ప్రారంభించింది. సూక్ష్మపోషకాల లోపాన్ని పరిష్కరించడానికి సరఫరా చేస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యం ఖర్చుతో కూడుకున్నది. సాధారణ బియ్యంలో ఐరన్(Iron), ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ-12 ఉంటాయి. కాబట్టి సరైన అవగాహన, సూచనలు లేకుండా ఫోర్టిపైడ్ బియ్యాన్ని తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ బియ్యాన్ని తింటే తీవ్ర ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.
సాధారణంగా మన శరీరానికి అవసరమైన ఇనుము మనం తినే పదార్థాల నుంచి లభిస్తుంది. ఇనుము వాడకం అధికమైతే ఆక్సీకరణ పెరుగుతుంది. అంతేకాకుండా తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వచ్చే పరిస్థితులు తలెత్తుతాయి. శరీరంలో ఐరన్ అధికంగా ఉండటాన్ని హేమోక్రోమాటోసిస్ అంటారు. ఐరన్ కాలేయం, ప్లీహం, ప్యాంక్రియాస్‌లో కూడా పేరుకుపోతుందని, ఇది దీర్ఘకాలిక కాలేయ వ్యాధికి లేదా ప్యాంక్రియాటైటిస్‌కు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అందించే ఉచిత పథకాలు చాలా వరకు గిరిజనులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పోషకాలతో కూడిన ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న విషయాన్ని గమనించాలని నిపుణులు కోరుతున్నారు.
వాస్తవానికి గతేడాది ఏప్రిల్ నుంచి దేశంలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని కేంద్రం చేపట్టింది. ఎఫ్‌సీఐ ద్వారా అర్హులకు అందిస్తోంది. పోర్టిఫైడ్ బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్‌తోపాటు విటమిన్ బీ12, విటమిన్ 2, విటమిన్ ఏ, జింక్‌తోపాటు మరికొన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయని బీఐఎస్ ప్రకటించింది. అయితే తాజాగా ఈబియ్యం హానికరం అని అధ్యయనాలు తేల్చడం ఆందోళన కలిగిస్తోంది.




మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి