Republic Day Violence: ఢిల్లీ అలర్ల కేసులో మరో కీలక సూత్రధారి ఇక్బాల్ అరెస్ట్.. పంజాబ్‌లో పట్టుకున్న స్పెషల్ సెల్..

Farmers Protest - Republic Day Violence: గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై దాడి ఘటనకు సంబంధించి మరో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఇక్బాల్‌ సింగ్‌ను స్పెషల్‌ సెల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు..

Republic Day Violence: ఢిల్లీ అలర్ల కేసులో మరో కీలక సూత్రధారి ఇక్బాల్ అరెస్ట్.. పంజాబ్‌లో పట్టుకున్న స్పెషల్ సెల్..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 10, 2021 | 12:30 PM

Farmers Protest – Republic Day Violence: గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై దాడి ఘటనకు సంబంధించి మరో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఇక్బాల్‌ సింగ్‌ను స్పెషల్‌ సెల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు బుధవారం వెల్లడించారు. మంగళవారం రాత్రి పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఇక్బాల్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఇక్బాల్‌ సింగ్‌పై రూ.50 వేల రివార్డు ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కాగా.. జనవరి 26న రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్‌సిధుని సోమవారం రాత్రి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీప్ సిధు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Also Read:

Farmers Protest: ఆ పాకిస్తాన్ – ఖలిస్తానీ ఖాతాలను తొలగించాలి.. ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు..

అన్నదాతల సంక్షోభ పరిష్కారానికి నేరుగా ప్రధాని మోదీ జోక్యం మేలు, ఎన్సీపీ నేత శరద్ పవార్