Farmers Protest: ఆ పాకిస్తాన్ – ఖలిస్తానీ ఖాతాలను తొలగించాలి.. ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు..

Central Government order to twitter: కేంద్ర ప్రభుత్వం మరోసారి ట్విట్టర్‌ను హెచ్చరించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన గురించి సోషల్‌మీడియా...

Farmers Protest: ఆ పాకిస్తాన్ - ఖలిస్తానీ ఖాతాలను తొలగించాలి.. ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 08, 2021 | 1:24 PM

Central Government order to twitter: కేంద్ర ప్రభుత్వం మరోసారి ట్విట్టర్‌ను హెచ్చరించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన గురించి సోషల్‌మీడియాలో దుష్ప్రచారం వ్యాప్తి చెందుతుండటంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ట్విట్టర్‌ను కోరింది. ఇప్పటికే రైతుల ఆందోళనపై రెచ్చగొట్టే విషయాలను పోస్ట్ చేస్తున్న ఖాతాలను నిలిపివేయాలని సూచించిన కేంద్రం.. తాజాగా మరిన్ని ఖాతాలను బ్లాక్‌ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆందోళనకు సంబంధించి విష ప్రచారం చేస్తున్న పాకిస్థానీ, ఖలిస్థానీ యూజర్లకు చెందిన 1,178 ఖాతాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.

అయితే గతంలో చేసిన హెచ్చరికలను అనుసరించని నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖ మరోసారి యూజర్లకు చెందిన అకౌంట్లతో సహా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఆదేశాలపై మైక్రోబ్లాగింగ్ సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది. రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేసిన ఖాతాలను పునరుద్ధరించిన నేపథ్యంలో కేంద్రం ట్విటర్‌ను ఇటీవల తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు సైతం జారీ చేసింది.

Also Read:

Farm Laws: కనీస మద్దతు ధర ఎప్పుడూ ఉంటుంది.. రైతులు ఉద్యమాన్ని వీడి చర్చకు రావాలి: ప్రధాని మోదీ

రైతుల నిరసనలపై ‘విదేశీ జోక్యం’, రాజ్యసభలో ప్రధాని మోదీ సెటైర్లు, ఎఫ్ డీ ఐ కి ‘కొత్త నిర్వచనం’