Khel Ratna Award: ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు ‘పొలిటికల్ గేమ్’ ..శివసేన ఆరోపణ

| Edited By: Anil kumar poka

Aug 09, 2021 | 7:43 PM

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చాలన్న కేంద్ర నిర్ణయం ప్రజల అభిమతం కాదని, ఇది కేవలం 'పొలిటికల్ గేమ్' అని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పేరిట గల క్రికెట్ స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరిట మార్చారని,

Khel Ratna Award: ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు ‘పొలిటికల్ గేమ్’ ..శివసేన ఆరోపణ
Shivsena Leader Sanjay Raut
Follow us on

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చాలన్న కేంద్ర నిర్ణయం ప్రజల అభిమతం కాదని, ఇది కేవలం ‘పొలిటికల్ గేమ్’ అని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పేరిట గల క్రికెట్ స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరిట మార్చారని, అయితే క్రికెట్ రంగానికి ఆయన చేసిన సేవలేమిటని సంజయ్ ప్రశ్నించారు.టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల, మహిళల హాకీ జట్లు మంచి ప్రతిభ కనబరచిన కారణంగా ధ్యాన్ చంద్ గౌరవార్థం ఆయన పేరిట ఈ అవార్డు పేరును మార్చాలని దేశంలోని అనేక ప్రాంతాల ప్రజల నుంచి తమకు అభ్యర్థనలు అందాయని , అందువల్ల ఇలా పేరు మారుస్తున్నామని మోదీ ఇటీవల పేర్కొన్నారు. కానీ ఇది ప్రజల అభిమతం కాదు.. పొలిటికల్ గేమ్.. రాజకీయ ద్వేషం అని సంజయ్ రౌత్ తమ సామ్నా పత్రికలో విమర్శించారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన త్యాగ నిరతిని అవమానించకుండానే ధ్యాన్ చంద్ ను కూడా గౌరవించవచ్చు అని ఆయన అన్నారు.

రాజీవ్ పేరును తొలగించడడం పొలిటికల్ హెట్రేడ్ అని ఆయన మండిపడ్డారు. ధ్యాన్ చంద్ ను గత ప్రభుత్వాలు విస్మరించలేదన్నారు. ఢిల్లీలోని ఫిరోజ్ ఖాన్ కోట్ల స్టేడియం పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చవచ్చునని ప్రజలు అంటున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఒలంపిక్స్ లో ఇండియా విజయాన్ని మోడీ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుంటోందని, మరి అలాంటప్పుడుక్రీడా బడ్జెట్ లో ఈ రంగానికి నిధుల్లో ఎందుకు కోత పెట్టారని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు.. వ్యభిచారానికి అడ్డగా బందర్ బీచ్..:Tourist Areas Video.

West Bengal: మమత బెనర్జీకి పొంచి ఉన్న పదవి గండం.. సీఎం పదవికి రాజీనామా చేస్తారా(వీడియో). 

Big News Big Debate LIVE Video: ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చేంత సత్తా కమలనాథులకుందా?

 రాష్ట్రపతి ఎన్నికపై నాగబాబు సంచలన వ్యాఖ్య.. సంచలనం రేపుతున్న ట్వీట్: Nagababu on President Post Live Video.