కోవిడ్ చికిత్సలో వాడే రెమ్ డెసివిర్ మెడిసిన్ మందు ఉత్పత్తిని నెలకు 38 లక్షల వైల్స్ నుంచి 1.19 కోట్ల వైల్స్ కి పెంచుతున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండియాలో గిలీడ్ లైఫ్ సైన్సెస్ ఇచ్చిన వాలంటరీ లైసెన్స్ కింద ఈ మందు ఉత్పత్తి అవుతోంది. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెటిరో, జుబిలియెంట్ ఫార్మా, మైలాన్, సీంజీన్, జైడస్, కేడిలా కంపెనీలు ఈ మెడిసిన్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశీయంగా దీని ప్రొడక్షన్ కెపాసిటీని పెంచడానికి అనువుగా సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఈ మంత్రిత్వ శాఖ వీటిని కోరింది. ఈ సంస్థలతో బాటు కేంద్ర సమన్వయ కృషితో ఇక నెలకు దాదాపు 119 లక్షల వైల్స్ ఉత్పత్తి అవుతాయని ఈ శాఖ వివరించింది. ఇప్పటికే ఈ సంస్థలతో ఈమేరకు సంప్రదింపులు జరిగినట్టు వెల్లడించింది.
దేశంలో ఇప్పటికే 38 అదనపు కేంద్రాలకు ఈ మెడిసిన్ అమ్మకాల విషయంలో అనుమతి లభించగా 22 సైట్ల సంఖ్యను 60 సైట్లకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. తద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ మందు అందుబాటులో ఉండగలదని ఆశిస్తున్నట్టు పేర్కొంది. దిగుమతుల ద్వారా కూడా దీని లభ్యతను పెంచడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11 నుంచి ఈ మెడిసిన్ ఎగుమతులను ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించింది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాల సంఖ్య పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంగానే ఈ మందు ఉత్పత్తిని పెంచుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పాకిస్తాన్ లో పోలీస్ స్టేషన్ పై గుంపుల దాడి, ‘ఆ వ్యక్తిని’ తమకు అప్పగించాలంటూ గంటకు పైగా బీభత్సం, పరుగులు తీసిన పోలీసులు