AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్ లో పోలీస్ స్టేషన్ పై గుంపుల దాడి, ‘ఆ వ్యక్తిని’ తమకు అప్పగించాలంటూ గంటకు పైగా బీభత్సం, పరుగులు తీసిన పోలీసులు

పాకిస్తాన్ లో ఓ పోలీసు స్టేషన్ పై వందల సంఖ్యలో ప్రజలు దాడి చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణపై పోలీసులు అరెస్టు చేసిన ఓ వ్యక్తిని తమకు అప్పగించాలంటూ వారు కర్రలు, ఇనుప రాడ్లతో దూసుకు వచ్చారు.

పాకిస్తాన్ లో పోలీస్ స్టేషన్ పై గుంపుల దాడి,  'ఆ వ్యక్తిని' తమకు అప్పగించాలంటూ గంటకు పైగా బీభత్సం, పరుగులు తీసిన పోలీసులు
Pakistan Mob Attacks Police
Umakanth Rao
| Edited By: |

Updated on: May 18, 2021 | 1:23 PM

Share

పాకిస్తాన్ లో ఓ పోలీసు స్టేషన్ పై వందల సంఖ్యలో ప్రజలు దాడి చేశారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణపై పోలీసులు అరెస్టు చేసిన ఓ వ్యక్తిని తమకు అప్పగించాలంటూ వారు కర్రలు, ఇనుప రాడ్లతో దూసుకు వచ్చారు. ఇస్లామాబాద్ లోని .గోర్లా పోలీసుల కస్టడీలో ఉన్న ఆ వ్యక్తి కోసం స్టేషన్ లో అన్ని చోట్లా వెదికారు. ఆ వ్యక్తి కనబడకపోయేసరికి పోలీసులపైనే తిరగబడ్డారు. స్టేషన్లోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ఆ గుంపు నుంచి తమను తాము రక్షించుకోవడానికి పోలీసులు భయంతో పరుగులు పెట్టారు. వీరిని అక్కడి నుంచి చెదర గొట్టేందుకు కౌంటర్ టెర్రరిజం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, యాంటీ రయట్ యూనిట్ల నుంచి వందల సంఖ్యలో పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. సుమారు గంట తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా ఇంతా చేస్తే దైవ దూషణకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అప్పటికే అజ్ఞాత ప్రదేశానికి తరలించినట్టు తెలిసింది. ఇలా దైవ దూషణకు దిగినవారికి పాకిస్థాన్ లో తీవ్రమైన శిక్షలు విధిస్తారు. ఇందుకు సంబంధించిన చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఈ చట్టాలను సవరించి కొంత మానవత్వం చూపాలని అంతర్జాతీయ దేశాలు చేస్తున్న అభ్యర్థనను పాకిస్థాన్ పెడచెవిన పెడుతోంది. మహమ్మద్ ప్రవక్త పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా భావిస్తున్న 29 మందికి 2019 లో మరణ శిక్షలు విధించారు. ఇంకా 80 మందికి పైగా జైళ్లలో మగ్గుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Defence Services Staff College: డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Viral Video: సూపర్‌ బామ్మ.. ! బౌలింగ్‌తో అదరగొట్టేసింది.. ! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Follow Us
యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న పాట..78 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్
యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న పాట..78 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్
భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో ముగిసే రైలు ప్రయాణం
భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో ముగిసే రైలు ప్రయాణం
'చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..' ఓ IAS కథ
'చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..' ఓ IAS కథ
ఇలా చేస్తే మటన్ ముక్క మెత్తగా, జ్యూసీగా మారిపోయిద్ది..
ఇలా చేస్తే మటన్ ముక్క మెత్తగా, జ్యూసీగా మారిపోయిద్ది..
ఏముందీ భయ్యా ఈ సాంగ్.. డీజేలను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
ఏముందీ భయ్యా ఈ సాంగ్.. డీజేలను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
ఆ రంగంలో 2030 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు..! కేంద్ర మంత్రి గడ్కారీ
ఆ రంగంలో 2030 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు..! కేంద్ర మంత్రి గడ్కారీ
వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు
వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
35 రోజుల్లో రూ.5.88 కోట్ల కానుకలు.. మల్లన్నకు భక్తుల వెల్లువ
35 రోజుల్లో రూ.5.88 కోట్ల కానుకలు.. మల్లన్నకు భక్తుల వెల్లువ
రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే
రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే