RELIEF FROM CORONA WORRY: కరోనా సెకెండ్ వేవ్ వర్రీ నుంచి విముక్తి కలిగించే గుడ్ న్యూస్ వచ్చేసింది..!

|

May 19, 2021 | 5:37 PM

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో అసలీ వైరస్ నియంత్రణలోకి వస్తుందా..? కరోనా నుంచి మానవాళి బతికి బట్టకడుతుందా అన్న సందేహాలు చాలా మందిలోను కలుగుతున్నాయి.

RELIEF FROM CORONA WORRY: కరోనా సెకెండ్ వేవ్ వర్రీ నుంచి విముక్తి కలిగించే గుడ్ న్యూస్ వచ్చేసింది..!
Covid Second Wave
Follow us on

RELIEF FROM CORONA WORRY DEATHS TO DECREASE: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో అసలీ వైరస్ నియంత్రణలోకి వస్తుందా..? కరోనా నుంచి మానవాళి బతికి బట్టకడుతుందా అన్న సందేహాలు చాలా మందిలోను కలుగుతున్నాయి. ఈ క్రమంలో వైద్య నిపుణులు (MEDICAL EXPERTS) గుడ్ న్యూస్ వినిపించారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) ప్రతీ రోజు మూడు లక్షలకు లోపుగా నమోదు అవుతోంది. కానీ.. మరణాల సంఖ్యే (DEATHS RATE) ఆందోళన రేపుతోంది. మరణాల సంఖ్య మాత్రం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రతీ రోజు నాలుగు లక్షలకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు, వదంతులు చెలరేగుతుండడంతో లక్షలాది మంది కరోనా కంట్రోల్ అవుతుందా అన్న సందేహాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చాలా మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారు. రోజుల తరబడి ఇళ్ళకే పరిమితమవడం చాలా మందిలో డిప్రెషన్‌కు కారణమవుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన గుడ్ న్యూస్ వీరిలో ఎంతో కొంత ఊరటనివ్వడం ఖాయం.

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాలు మాత్రం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ (JUNE 2021)‌ నుంచి కరోనా మరణాల్లో తగ్గుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు (LOCK DOWNS) అమల్లో వుండడం, మే నెలాఖరు దాకా దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్‌లో వుండబోతుండడం జూన్‌లో సత్ఫలితాలివ్వడం ఖాయమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్‌లకు తోడుగా వ్యాక్సిన్ కొరతను అధిగమిస్తామని వారు వెల్లడించారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ (VACCINE)‌ అందేలా చూడటం వల్ల కరోనా మరణాల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుందని తెలిపారు.

భారత్ (BHARAT)‌లో తయారవుతున్న కొవాగ్జిన్‌ (COVAXINE), కోవిషీల్డ్ (COVIE SHIELD)‌ టీకాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రోజుకు 25లక్షలకు పైగా డోసులు అందించాలని ఇప్పటికే టీకా తయారీదారులకు సూచించారు. జూన్‌ నుంచి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చి వ్యాక్సినేషన్ (VACCINATION)‌ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. రోజు రోజుకూ వ్యాక్సిన్ తీసుకొనే వారి సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోందని నిపుణులు తెలిపారు. వీలైనంత త్వరలో 45ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందించడం పూర్తి చేసి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ (RAJASTAN)‌, బీహార్ (BIHAR)‌, ఢిల్లీ (DELHI), ఉత్తరప్రదేశ్ (UTTAR PRADESH)‌, హర్యానా (HARYANA)ల్లో ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు అందిస్తుండగా.. మిగతా రాష్ట్రాల్లో ప్రారంభించాల్సి ఉంది.

మరోవైపు వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ (UNION HEALTH MINISTER DR HARSHAVARDHAN) తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కోవిడ్ (COVID-19) బాధితులకు చికిత్స అందిస్తున్న సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిని సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు లేకపోవడంతో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు మంత్రి హర్షవర్ధన్‌. రాబోయే రోజులు కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రోజుకు 25 లక్షల కోవిడ్‌ టెస్టులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో దేశంలో 20 లక్షలకుపైగా నమూనాలను మే 18న పరీక్షించినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. త్వరలోనే రోజు 25 లక్షల టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో రోజువారీ పరీక్షలు పెంచనున్నట్లు ప్రకటించారు.

ఇక గతేడాదిలో కరోనా దేశంలో పట్టణాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందగా రెండోవేవ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో భారీగా వైరస్ సోకుతోంది. గడిచిన వారం రోజులుగా దేశంలో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మే 19న వెల్లడైన గణాంకాల ప్రకారం కొత్త కేసులు 2 లక్షల 67 వేల 334 కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడో రోజు మూడు లక్షల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జూన్ మొదటి వారం నుంచి మరణాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య వర్గాలు ప్రకటించడం కొంతో కొంత ఊరట నిచ్చే ప్రకటనగానే భావించాలి.

ALSO READ: ఛాలెంజింగ్ ధోరణి.. అంతలోనే సంధి.. ఆ వెంటనే అమీతుమీ.. అసలు ఈటల వ్యవహారంలో జరిగిందిదే !

ALSO READ: ప్రెసిడెంట్ బైడెన్ సరికొత్త వ్యూహం.. ఆ చర్యల వెనుక అదే లక్ష్యం!