Viral: పోర్ట్‌లో అనుమానాస్పదంగా పైపుల లోడ్.. లోపల చెక్ చేసి స్టన్ అయిన పోలీసులు

పోలీసుల కళ్లు గప్పి ఏపీకి చెందిన అత్యంత విలువైన కలుపను తరలించేందుకు చాలా క్రియేటివ్‌గా థింక్ చేస్తున్నారు స్మగ్లర్లు. ఇప్పటివరకు పండ్ల లోడు మాటున.. పాల వ్యాన్లు లోపల రూపంలో ఎర్రచందనం తరలించేందుకు ప్రయత్నించిన చాలామంది స్మగ్లర్స్.. పోలీసులకు చిక్కారు. తాజాగా..

Viral: పోర్ట్‌లో అనుమానాస్పదంగా పైపుల లోడ్.. లోపల చెక్ చేసి స్టన్ అయిన పోలీసులు
Crime News
Follow us

|

Updated on: Apr 28, 2022 | 10:22 PM

ఎర్రచందనం స్మగ్లర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు అనేక మార్గాల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం.. ఏపీ(AP)లోని  రాయలసీమ(Rayalaseema) ప్రాంతంలో ఉన్న శేషాచలం కొండల్లో మాత్రమే దొరుకుతుంది. శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఈ ఎర్ర చందనాన్ని అక్రమార్కులు ప్రాణాలకు తెగించి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా చెన్నైలోని  తూత్తుకుడి పోర్ట్‌ లో భారీగా ఎర్రచందనం పట్టుబడింది.  బెంగళూరు పోలీసుల సమాచారంతో బాగోతం బయటపడింది. చిత్తూరు నుంచి మలేషియాకు తూత్తుకుడి పోర్ట్ ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 12 కోట్లు విలువైన ఎర్రచందనం భారీ పైపులలో ఉంచి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ఏడు టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు నుంచి ఎర్ర చందనం దుంగలను తమిళనాడులోని తూత్తుకుడి పోర్ట్‌కి ముఠా తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.  హైవేలో పోలీస్ తనిఖీలలో ఎక్కడ దొరక్కుండా ముఠా చాకచక్యంగా వ్యవహరించింది. కంటైనెర్ లారీని సీజ్ చేసిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు.

Also Read: Andhra Pradesh: ఏపీలోని ఈ మండలాల ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక.. బీ అలెర్ట్