కొన్ని రకాల వ్యాక్సిన్లు వాడాక కొందరిలో బ్లడ్ క్లాటింగ్ లక్షణాలు ఎందుకు కనబడుతున్నాయంటే ? రీసెర్చర్ల విశ్లేషణలో కొత్త విశేషాలు

| Edited By: Phani CH

May 27, 2021 | 11:07 AM

కొన్ని రకాల వ్యాక్సిన్లు వాడిన అనంతరం కొంతమందిలో బ్లడ్ క్లాటింగ్ (రక్తం గడ్డ కట్టడం) వంటి లక్షణాలకు కారణం తెలిసిందంటున్నారు నిపుణులు.

కొన్ని రకాల వ్యాక్సిన్లు  వాడాక కొందరిలో బ్లడ్ క్లాటింగ్ లక్షణాలు ఎందుకు కనబడుతున్నాయంటే ? రీసెర్చర్ల విశ్లేషణలో కొత్త విశేషాలు
Reason For Blood Clotting
Follow us on

కొన్ని రకాల వ్యాక్సిన్లు వాడిన అనంతరం కొంతమందిలో బ్లడ్ క్లాటింగ్ (రక్తం గడ్డ కట్టడం) వంటి లక్షణాలకు కారణం తెలిసిందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆస్ట్రాజెనికా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు తీసుకున్న కొంతమందిలో ఈ విధమైన కేసులు అక్కడక్కడా వెలుగులోకి వచ్చాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఇలాంటి కేసులు బయట పడ్డాయి. దీనికి కారణం వ్యాక్సిన్లలో కోల్డ్ వైరస్ లను వినియోగించడంవల్లే ఇలా జరుగుతోందని జర్మనీ పరిశోధకులు వెల్లడించారు. కోవిద్- 19 టీకామందుల తయారీలో అడినోవైరస్ వెక్టార్స్ ని వాడుతున్నారని, స్థూలంగా ఇవే ఇందుకు ప్రధాన కారణమవుతున్నాయని వారు తేల్చారు. ఈ మేరకు తమ పరిశోధనా ఫలితాలను వారు ఓ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. అంటే వ్యాక్సిన్ నాణ్యతను పెంచేందుకు వాడే మూల పదార్థాలే ఇవి అని వారు వివరించారు. వీటి పే లోడ్ కణజాలంలోకి చొచ్చుకుపోతుందని, ఫలితంగా రక్తం గడ్డ కడుతుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ తయారీదారులు స్పైన్ ప్రోటీన్లను మాడిఫై చేయడం ద్వారా, అంటే మార్చడం ద్వారా ఈ చిన్నపాటి సమస్యను పరిష్కరించుకోవచ్చునని ఫ్రాంట్ పర్ట్ లోని గోయెత్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వివరించారు. స్పైస్ రియాక్షన్లను పెంచడం వల్ల ఇలాంటివి సంభవిస్తాయని….కానీ బయో ఎన్ టెక్, మోడెర్నా కంపెనీలు ఈ విధమైన పద్దతిని నివారిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

ప్రజల్లో కొంతమందిలో లో బ్లడ్ ప్లేట్ లెట్ కౌంట్స్ కూడా ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయని వారు తెలిపారు. బ్లడ్ క్లాట్అయినంత మాత్రాన టెన్షన్ పడరాదని, ఇందుకు తగిన మెడిసిన్స్ ఉన్నాయని వారన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Dead Bodies: స‌ర‌యూ తీరంలో మృతదేహాల కలకలం.. కరోనా మృతదేహాలు అంటూ భయాందోళన చెందుతున్న స్థానికులు..

SBI Scheme: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఈ స్కీమ్‌లో చేరడానికి గడువు జూన్ 30వ తేదీ