బాంబు ప్రమాదంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. తాను తయారుచేసిన బాంబులను పరీక్షిస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తూ అవి పేలడంతో మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితమే ఈ సంఘటన జరిగింది. అయితే మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఆలస్యంగా రవి మరణాన్ని ధ్రువీకరించింది. మావోయిస్టు టెక్నికల్ టీంలో సభ్యుడిగా ఉన్న రవికి కమ్యునికేషన్స్‌తో పాటు ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో ఎంతో నైపుణ్యముంది. ఈ మేరకు జూన్ 5, 2020 న జార్ఖండ్‌లో జరిగిన ఓ బాంబు ప్రమాదంలో రవి మృతిచెందాడని, అతనికి విప్లవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినట్లు మావోయిస్ట్ పార్టీ వెల్లడించింది.
ఐఈడీలు అమర్చడంలో నేర్పరి..
నెల్లూరు జిల్లా కు చెందిన కామ్రేడ్ రవి మావోయిస్టు కార్యకలాపాల పట్ల ఆకర్షితుడయ్యాడు. 2014 గెరిల్లా జోన్ నుంచి విధులు నిర్వర్తించాడు. ఆతర్వాత జార్ఖండ్‌లో ఈఆర్‌బీ స్టాఫ్‌గా పనిచేశాడు. కంప్యూటర్ పరిజ్ఞానం, ఎలక్ర్టిల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి విషయాలపై అతనికి బాగా అవగాహన ఉంది. ముఖ్యంగా బాంబులు పేల్చేందుకు ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో అతను బాగా దిట్ట. అదేవిధంగా అత్యాధునిక ఐఈడీలు అమర్చడంలో బాగా ఆరితేరాడు. ముఖ్యంగా ప్రజావిముక్తి గెరిల్లా సైన్యానికి(పీఎల్‌జీఏ)కు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చడంలో రవి కీలక పాత్ర పోషించాడు. ఈక్రమంలో తాను తయారుచేసిన బాంబులను పరీక్షిస్తున్న సమయంలోనే అతను మృత్యువాతపడడం గమనార్హం. ఈ మేరకు మావోయిస్ట్ కేంద్ర కమిటీ రవి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం చేరవేసింది.
Also read:
Farmers Protest: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు పరిహారం..
Kangana Ranaut: కంగనా రనౌత్ నుంచి పద్మ శ్రీ వెనక్కి తీసుకోండి.. కేంద్రానికి శివసేన డిమాండ్
Air Pollution: వాతావరణ కాలుష్యంలో ప్రపంచంలోనే ఢిల్లీ టాప్ ప్లేస్‌లో.. ఆందోళన కలిగిస్తున్న వాస్తవం!