ముంబై ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కంటి సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడి కన్ను కొరికేసింది ఓ ఎలుక. కంటి కింది కనుబొమ్మల వద్ద ఎటాక్ చేయడంతో, తీవ్రగాయాలు అయ్యాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డ బాధితుడు.. ఆస్పత్రి సిబ్బందిపై కేసు నమోదు చేస్తానని హెచ్చరించాడు. గత కొద్దిరోజుల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్న సదరు వ్యక్తి.. తాజాగా కన్ను ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రిలో చేరాడు. అయితే ఇంతలోనే ఇలా జరిగిందంటూ తన బాధను వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే ఎలుక కొరికిన చోట కొద్దిపాటి గాయాలు మాత్రమే అయ్యాయని, కంటికి ఎలాంటి హాని లేదని వైద్యులు తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపడతామని ఆస్పత్రి డీన్ విద్యా థాకూర్ అన్నారు. ఆస్పత్రిలోని గ్రౌండ్ ప్లోర్ వార్డులో ఈ ఘటన జరిగింది. కాగా, ఆసుపత్రి ప్రాంగణంలో కొంతమంది చెత్తను పారేయడం ద్వారా ఎలుకలు సంచరిస్తున్నాయని బాధితుడి కుటుంబసభ్యులు అంటున్నారు.
Also Read:
13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!
పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!