కేరళలో మరో అరుదైన వ్యాధి వెలుగు చూసింది. కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వింత వ్యాధి కేసు నమోదైంది. పనవల్లికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఈ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యాధి మొదటిసారిగా 2017లో అలప్పుజా మునిసిపాలిటీ ప్రాంతంలో నమోదైంది. ఆ తర్వతే ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. పరాన్నజీవి లేకుండా నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా తరగతికి చెందిన వ్యాధికారక క్రిముల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
కాలువలు, చెరువులు వంటి నీళ్లలో స్నానం చేయడం ద్వారా ముక్కు, సన్నని చర్మం ద్వారా ఈ క్రిములు మానవ శరీరంలోకి ప్రవేశించి మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. జ్వరం, తలనొప్పి, వాంతులు, మైకము ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వైద్యులు వెల్లడించారు.
కలుషితమైన నీటితో స్నానం చేయడం, మీ ముఖం, నోటిని అపరిశుభ్రమైన నీటితో కడగడం మానుకోండి. ఎందుకంటే ఇది వ్యాధికి ఇలాంటి పనులే కారణమవుతున్నాయి.. వర్షాకాలంలో ప్రవహించే నీళ్లు, కాలువలలో స్నానం చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులు, స్థానిక ఆస్పత్రి డీఎంఓ తెలియజేసారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..