యోగా గురువు రామ్‌దేవ్ బాబా(Ramdev baba) రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై ఫైర్ అయ్యారు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను.. ఓ రిపోర్టర్ పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రశ్నలు అడిగారు. పెట్రోల్(Petrol), వంటగ్యాస్ ధరల గురించి గతంలో రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్ రూ.40, గ్యాస్ సిలిండర్ రూ.300కు ఇచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలంటూ చేసిన మాటలపై రిపోర్టర్(Reporter) ప్రశ్నలు అడిగారు. ఈ ఆ ప్రశ్నతో రామ్‌దేవ్ బాబా ఇబ్బంది పడ్డారు. ‘అవును నేను ఆ మాట అన్నాను. ఇప్పుడేం చేస్తావ్? నీకు సమాధానం ఇవ్వడానికి నేను నీ కాంట్రాక్టర్‌ను కాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటితో ఆగకుండా ఆ రిపోర్టర్ మరోసారి ఇదే ప్రశ్నను అడిగారు. సహనం కోల్పోయిన రామ్ దేవ్ బాబా..‘నేను ఆ మాట అన్నాను. అయితే ఏంటి..? నోర్ముసుకో. మళ్లీ అడిగితే బాగుండదు. పద్ధతిగా ఉండు’ అని హెచ్చరించారు.
Yoga Guru Ramdev was seen on camera losing his cool and threatening a journalist, who asked him about his comments in the past on reducing petrol price. @ndtv pic.twitter.com/kHYUs49umx
— Mohammad Ghazali (@ghazalimohammad) March 30, 2022
చమురు ధరలు తగ్గితే.. పన్ను రాదని ప్రభుత్వం చెబుతోంది. ఆదాయం తగ్గితే ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలి. ప్రజల సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి. దేశాన్ని ఎలా నడిపించాలని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అసలైతే ఈ ద్రవ్యోల్బణం తగ్గాలి. అది నేను ఒప్పుకుంటా. కానీ, ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా శ్రమించాలి. నేను ఉదయం నాలుగు గంటలకు లేచి రాత్రి పది వరకు పనిచేస్తాను. ధరలు పెరుగుతోన్న ఈ క్లిష్ట సమయంలో ప్రజలు కష్టపడి పనిచేయాలి.
-బాబా రామ్‌దేవ్, యోగా గురువు
మరోవైపు ఇవాళ కూడా దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. గురువారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను 80 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత 10 రోజుల్లో 9 సార్లు వీటి ధరలు సవరించారు. ఈ వ్యవధిలో లీటర్ పెట్రోల్ ధర రూ.6.40 పెరిగింది. ఈ వరుస పెంపులతో విపక్షాలు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నాయి.
Also Read
Eat Fruits: పండ్లు ఏ సమయంలో తింటే మంచిదో తెలుసా.. నిపుణులు ఏమంటున్నారంటే..
OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. లిస్టులో రెండు బడా హీరోల చిత్రాలు!