Ram Dev Baba: రెజ్లర్లకు బాబా రామ్‌దేవ్ మద్ధతు.. బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్

|

May 27, 2023 | 2:21 PM

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ గత కొన్నిరోజులుగా స్టార్ రెజ్లర్లు నిరసనలు చేస్తున్నారు. వీరు చేస్తున్న నిరసనలపై ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా స్పందించారు.

Ram Dev Baba: రెజ్లర్లకు బాబా రామ్‌దేవ్ మద్ధతు.. బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్
Ram Dev Baba
Follow us on

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌ను అరెస్టు చేయాలంటూ గత కొన్నిరోజులుగా స్టార్ రెజ్లర్లు నిరసనలు చేస్తున్నారు. వీరు చేస్తున్న నిరసనలపై ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా స్పందించారు. ఆయన కూడా మల్ల యోధులకు మద్ధతు తెలిపారు. ఇలాంటి పరిస్థితి రావడం సిగ్గుచేటని.. వేధింపులకు పాల్పడే వ్యక్తులను అరెస్టు చేయాలన్నారు. బ్రిజ్ భూషన్‍‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై మీడియా ఆయన్ని ప్రశ్నించగా.. తాను కేవలం ప్రకటనలు మాత్రమే చేయగలనని.. అతడ్ని జైల్లో పెట్టే అధికారం లేదని తెలిపారు. దేశంపై తనకో విజన్ ఉందని.. రాజకీయంగా ప్రకటనలు చేస్తే అవి మలుపులు తిరుగుతాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఆదివారం జరగబోయే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి బ్రిజ్‌ భూషణ్ హాజరైతే.. దేశంలో ఉన్న పరిస్థితులపై స్పష్టమైన సందేశం ప్రజలకు వెళ్తుందని రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్ అన్నారు. ఆయనకు ఎవరు మద్దతు పలికినా వారు మాకు వ్యతిరేకమేనని.. ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తమకు తెలియదని.. కొంతమంది మాత్రం ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోని ఆడబిడ్డలకు ఆయన హాని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..