AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shashi Tharoor VS Ramdas Athawale: శశిథరూర్‌కు ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పిన కేంద్రమంత్రి.. గట్టిగా కౌంటర్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) ఇంగ్లిష్‌ ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భానుసారంగా ఆయన ఉపయోగించే ఇంగ్లిష్‌ పదాలకు అర్థాలు తెలియాలంటే ఒక్కోసారి డిక్షనరీలను ఆశ్రయించాల్సిందే.

Shashi Tharoor VS Ramdas Athawale: శశిథరూర్‌కు ఇంగ్లిష్‌ పాఠాలు చెప్పిన కేంద్రమంత్రి.. గట్టిగా కౌంటర్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ..
Basha Shek
|

Updated on: Feb 11, 2022 | 11:35 AM

Share

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) ఇంగ్లిష్‌ ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సందర్భానుసారంగా ఆయన ఉపయోగించే ఇంగ్లిష్‌ పదాలకు అర్థాలు తెలియాలంటే ఒక్కోసారి డిక్షనరీలను ఆశ్రయించాల్సిందే. అలాంటి శశిథరూర్‌కే ఇంగ్లిష్ పాఠాలు చెప్పారు కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే (Ramdas Athawale). పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రామ్‌దాస్‌ తీరును విమర్శిస్తూ ఎంపీ థరూర్‌ ఒక ట్వీట్‌ పెట్టారు. అందులో కొన్ని ఇంగ్లిష్‌ పదాలు తప్పుగా దొర్లాయి. ఇంగ్లిష్‌లో ఎంతో పరిజ్ఞానం ఉన్న థరూర్‌ ట్వీట్‌లో తప్పులు దొర్లడం నెటిజన్లకు కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే సమయంలో కేంద్రమంత్రి కూడా కాంగ్రెస్‌ నేత తప్పులను పట్టుకున్నారు. వాటిపై వ్యంగంగా స్పందిస్తూ  ఎంపీకి ఇంగ్లిష్ పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. వీటికి థరూర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.  అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. కేంద్ర బడ్జెట్‌పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం మాట్లాడారు. ఆ సమయంలో మరో కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే విచిత్రమైన ముఖ కవలికలు, హావభావాలను ప్రదర్శిస్తూ కనిపించారు. వీటికి సంబంధించిన ఫొటోలను శశిథరూర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

బైడ్జెట్‌ కాదు.. బడ్జెట్‌..!

‘దాదాపు రెండు గంటల పాటు బడ్జెట్‌పై చర్చ సాగింది. రామ్‌దాస్‌ అథవాలే ఆశ్చర్యపోతూ కనిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆర్థిక మంత్రి చెప్పిన మాటలను ట్రెజరీ బెంచ్ లే నమ్మలేకపోతున్నాయి’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. అయితే ఈ ట్వీట్ లో Budget అనే పదాన్ని Bydget గానూ, Reply అనే పదాన్ని Rely అని తప్పుగా రాశారు థరూర్‌. అంతే ఈ తప్పులను పట్టుకున్న కేంద్రమంత్రి ఎంపీకి కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘డియర్‌ శశిథరూర్‌, అనవసరపు వాదనలు, ప్రకటనలు చేసే సమయంలో ఇలా తప్పులు చేయక తప్పదే. అది బైడ్జెట్‌ కాదు బడ్జెట్‌, అదేవిధంగా రెలై కాదు. రిప్లై’ అంటూ రాసుకొచ్చారు. ఆ వెంటనే శశిథరూర్‌ కూడా స్పందించారు ‘నేను తప్పులు సరిదిద్దుకున్నాను. చెత్త ఇంగ్లిష్‌ కన్నా అజాగ్రత్తగా టైప్‌ చేయడం పెద్ద పాపమే. జేఎన్‌యూలో ఉండే కొందరికి కూడా మీ ఇంగ్లిష్ పాఠాలు చాలా అవసరం’ అని కేంద్రమంత్రికి తిరిగి కౌంటర్‌ ఇచ్చారు.

వారికి మీతో ట్యూషన్‌ చెప్పించాలి..

కాగా ఇటీవల డిల్లీలోని జేఎన్‌యూ కొత్త వైస్‌ ఛాన్స్‌లర్‌ చేసిన ఓ ప్రకటనలో అక్షర దోషాలు వచ్చాయి. బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ఆ వీసీ ప్రకటనను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘ జేఎన్‌యూ వీసీ నుంచి వచ్చిన ఈ ప్రకటన నిరక్షరాస్యతకు నిలువుటద్దంలా కనిపిస్తోంది. ఇది వ్యాకరణ దోషాలతో నిండి ఉంది. ఇటువంటి నియామక ప్రకటనలు.. మానవ వనరులు, యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తాయి’ అని రాసుకొచ్చారు. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు శశిథరూర్‌. కేంద్రమంత్రికి కౌంటర్‌ ఇచ్చారు.

Also Read: Andhra Pradesh: విద్యార్థినులను వేధించవద్దన్నందుకు.. ప్రిన్సిపాల్‌ను వెంటపడి కొట్టిన స్టూడెంట్స్

TS SSC Exam Date: తెలంగాణ పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ ఖరారు..?

Khiladi Twitter Review: యాక్షన్ ప్యాక్డ్ మాస్ హిట్ అంటున్నారుగా.. ఖిలాడి ట్విట్టర్ రివ్యూ

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!