Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామ మందిరం 2024 జనవరి రెండోవారం నాటికి సిద్ధమవుతుందని రామ జన్మభూమి మందిర్ (Janmabhoomi Temple)తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ (Champat Rai) చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలో ఆయోధ్య పర్వ్ కార్యక్రమంలో మాట్లాడారు. 2024లో మకర సంక్రాంతి రోజున రామాలయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి మందిర నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. రాళ్లను చెక్కే పని ఇప్పటికే మొదలయ్యిందన్నారు.
అయితే ఎలాంటి విపత్తులు వచ్చినప్పటికి తట్టుకునేలా ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. గర్భగుడి నిర్మాణం అవుతున్న చోట 14 మీటర్ల వరకు భూమి లోపల పునాది నిర్మాణం, మిగతా చోట 12 మీటర్ల ఎత్తులో పునాది నిర్మాణాన్ని పూర్తి చేశారు. వివిధ రకాల కాంక్రీట్‌తో పునాది నిర్మాణం జరిగింది. అయితే 2023 డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. 2024 నాటికి భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఇటుకలు , స్టీల్‌ను వినియోగించకుండా రాజస్థాన్‌కు చెందిన పాలరాతితో ఆలయ నిర్మాణం జరుగుతోంది. రాముడు కూర్చునేందుకు గ్రానైట్‌తో ఆరడుగుల ఎత్తైన కుర్చీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో పునాది, ఇతర పనులు పూర్తవుతాయని అన్నారు.
అయోధ్యలో 2020లో ఆగస్ట్ 5వ తేదీన భూమి పూజ జరిగింది. ప్రధాని మోదీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. మూడంతస్తుల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: