Ram Nath Kovind: ప్రజల మధ్యకు ప్రథమ పౌరుడు.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. ఫొటోలు దిగుతూ రాష్ట్రపతి సందడి..

|

Sep 19, 2021 | 5:37 AM

President Ram Nath Kovind: దేశ ప్రథమ పౌరుడు అంటే.. భద్రత మామూలుగా ఉండదు.. ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందిని మోహరించి.. కఠిన ఆంక్షలను అమలు చేస్తారు.. అలాంటి వలయాన్ని

Ram Nath Kovind: ప్రజల మధ్యకు ప్రథమ పౌరుడు.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. ఫొటోలు దిగుతూ రాష్ట్రపతి సందడి..
Ram Nath Kovind
Follow us on

President Ram Nath Kovind: దేశ ప్రథమ పౌరుడు అంటే.. భద్రత మామూలుగా ఉండదు.. ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందిని మోహరించి.. కఠిన ఆంక్షలను అమలు చేస్తారు.. అలాంటి వలయాన్ని దాటి రాష్ట్రపతి.. సామన్య ప్రజలతో మమేకమయ్యారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సాధారణ వ్యక్తిలా షాపుల వద్ద తిరుగుతూ సందడి చేశారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నాలుగు రోజుల పర్యటన కోసం సిమ్లా వెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర హోదా లభించి 50 ఏళ్లయిన సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. శనివారం అధికారిక కార్యక్రమాల అనంతరం.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సిమ్లా అందాలను చూస్తూ.. ప్రజల మధ్య తిరుగుతూ సందడి చేశారు.


ఈ క్రమంలో సిమ్లాలో హెచ్పీఎంసీ దుకాణానికి వెళ్లిన ఆయన ఓ సాధారణ పౌరుడిలా నచ్చిన ఆహార పదార్థాలను కొని తిన్నారు. పాప్ కార్న్ కొనుక్కుని ఎంతో ఇష్టంగా తిన్నారు. పలు ప్రాంతాల్లో పర్యాటకులతో ముచ్చటిస్తూ.. వారితో ఫొటోలు సైతం దిగారు. ఈ క్రమంలో సిమ్లాలో తన పర్యటన దృష్ట్యా ఇబ్బందులు పడుతున్నారా..? అంటూ ఓ వ్యక్తిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. లేదని.. మీరు గౌరవ అతిథులు అంటూ సమాధానమిచ్చాడు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తమతో చనువుగా మాట్లాడడం ఆనందంగా ఉందంటూ పర్యాటకులు పేర్కొన్నారు. కాగా.. హిమాచల్ ప్రదేశ్ పర్యటనను ముగించుకొని రాష్ట్రపతి కోవింద్ నేడు ఢిల్లీకి పయనం కానునున్నారు.

Also Read:

Statue of Equality: పుడమి పుణ్యం.. భగవద్రామానుజుల జననం..! భారతావని సుకృతం.. ఆ సమతామూర్తి దివ్య విగ్రహం..!!

Ganesh Immersion: బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి సర్వం సన్నద్ధం.. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు