మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్(Ram Nath Kovind) రాష్ట్రపతి భవన్‌ను వీడారు. ఢిల్లీ జన్‌పథ్ రోడ్డులోని తన కొత్త నివాసానికి ఆయన తన కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అంతకు ముందు దేశ 15వ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. కొత్త రాష్ట్రపతి ముర్ము చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిండ్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌పై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ఫైరయ్యారు. రాంనాథ్ కోవింద్ దేశ రాజ్యాంగాన్ని పణంగా పెట్టి బీజేపీ రాజకీయ అజెండాను అమలుచేశారంటూ ధ్వజమెత్తారు. రాంనాథ్ హయాంలో దేశ రాజ్యాంగం పలుసార్లు ఉల్లంఘనకు గురైయ్యిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ బిల్లును ప్రస్తావిస్తూ రాంనాథ్ కోవింద్‌ను టార్గెట్ చేశారు. అలాగే మైనార్టీలు, దళితులపై దాడుల అంశాలను మెహబూబా ముఫ్తీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.
The outgoing President leaves behind a legacy where the Indian Constitution was trampled upon umpteenth times. Be it scrapping of Article 370,CAA or the unabashed targeting of minorities & Dalits, he fulfilled BJPs political agenda all at the cost of the Indian Constitution.
— Mehbooba Mufti (@MehboobaMufti) July 25, 2022
కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏర్పాటు చేయడం తెలిసిందే. దీనికి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలపడంపై అసంతృప్తితో మెహబూబా ముఫ్తీ.. మాజీ రాష్ట్రపతిపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..