Rajnath Singh: చైనా సరిహద్దు వివాదంపై స్పందించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఏమన్నారంటే ?

|

Sep 21, 2023 | 5:21 PM

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదానికి ఇంకా ముగింపు పడలేదు. ఇప్పటకీ కూడా పలుమార్లు ఈ వివాదం తెరపైకి వస్తూనే ఉంది. అయితే చైనా నుంచి సరిహద్దు సవాళ్లు ప్రతిసారి ఎదురవుతున్న సంగతి తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. సరిహద్దు సవాళ్లపై పార్లమెంటులో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తోన్నాయి.

Rajnath Singh: చైనా సరిహద్దు వివాదంపై స్పందించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఏమన్నారంటే ?
Defence Minister Rajnath Singh
Follow us on

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదానికి ఇంకా ముగింపు పడలేదు. ఇప్పటకీ కూడా పలుమార్లు ఈ వివాదం తెరపైకి వస్తూనే ఉంది. అయితే చైనా నుంచి సరిహద్దు సవాళ్లు ప్రతిసారి ఎదురవుతున్న సంగతి తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. సరిహద్దు సవాళ్లపై పార్లమెంటులో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తోన్నాయి. ప్రస్తుతం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సరిహద్దు వివాదం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతరిక్ష రంగంలో భారత విజయాలపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరి జోక్యం చేసుకున్నారు. అలాగే చైనాతో ఉన్నటువంటి సరిహద్దు ప్రతిష్టంభనను ప్రస్తావించారు.

అయితే దీనిపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించే ధైర్యం తమకు ఉందంటూ స్పష్టం చేశారు. అలాగే ఇటీవల చంద్రయాన్‌-3 ప్రాజెక్టు విజయంతో పాటు భారత్‌ సాధించిన ఆయా అంతరిక్ష విజయాలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం లోక్‌సభలో చర్చను మొదలుపెట్టారు. అలాగే దేశ సరిహద్దు భద్రత, దేశ సరిహద్దును రక్షించడంలో సైన్స్ పాత్రను కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా లోక్‌సభలో విపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి జోక్యం చేసుకొని.. చైనాతో భారత్‌కు ఉన్నటువంటి సరిహద్దు వివాదం అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కచ్చితంగా పార్లమెంటులో చర్చ జరిగి తీరాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. నాకు ధైర్యం ఉందని అన్నారు. సరిహద్దు వివాదంపై చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. 2020లో గల్వాన్‌ లోయనలో ఘర్షణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా భారత్‌- చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి అందిరికీ తెలిసిందే. అంతేకాదు ఆ తర్వాత భారత్, చైనాల మధ్య సైనిక అధికారుల మధ్య విడతలవారీగా చర్చలు జరిగాయి. అయితే సరిహద్దులోని పలుచోట్ల మాత్రమే వివాద పరిష్కారాలు జరిగాయి. కానీ ఇప్పటికీ కూడా ఇంకా.. అయిదారు ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇటీవలే విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ కూడా పేర్కొన్నారు. మరోవైపు చూసుకుంటే చైనాతో సరిహద్దు వివాదం అంశం పట్ల విపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ అంశంపై పార్లమెంటులో చర్చించాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..