Rajdhani Express: ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో వెస్ట్రన్ రైల్వే కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన తేజన్ స్వీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్త కోచ్‌లు మెరుగైన సౌకర్యాలతో ఉత్తమ ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తేజస్ స్మార్ట్‌కోచ్ సౌకర్యంతో సుదూర ప్రయాణంలో ప్రయాణికులకు మధురానుభూతి కలిగిస్తుందని తెలిపింది. రైలు నెంబర్ 02951/52 ముంబై – న్యూఢిల్లీ రాజధాని స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో తేజస్ తరహా స్వీపర్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
కాగా, భారతీయ రైల్వే ప్రయాణికులు తమ జర్నీని సౌకర్యవంతంగా పూర్తి చేసేందుకు భారతీయ రైల్వే అన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రైలు కోచ్‌లల్లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం తేజస్ రైళ్లల్లో ఉన్నట్టుగా ఇతర రైళ్లల్లో కోచ్‌లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశంలోని పలు రూట్లల్లో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఆ రైళ్లల్లో ఉన్న సౌకర్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఉన్న కోచ్‌లను ఇతర కోచ్‌లల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ స్లీపర్ కోచ్‌లల్లో అనేక స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఆటోమెటిక్ ప్లగ్ డోర్, స్టెయిన్‌లెస్ స్టీల్ అండర్‌ఫ్రేమ్, బయో వ్యాక్యూమ్ టాయిలెట్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్ బోగీలు, ఫైర్ అలారం, డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే రైలు లోపల అద్భుతమైన ఇంటీరియల్, సీసీటీవీ కెమెరాలు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, బయో టాయిలెట్స్, డిజిటల్ డెస్టినేషన్ బోర్డ్, అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ లాంటివి కూడా అందుబాటులో ఉంటాయి. దూర ప్రయాణం చేయాలనుకునేవారికి ఇలాంటి కోచ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
ఇలాంటి మరో 500 కోచ్‌లను తయారు చేయిస్తోంది భారతీయ రైల్వే. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ కోచ్‌లు తయారవుతున్నాయి. 2021-22 సంవత్సరంలోనే ఈ 500 కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది.