
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరోహిలోని పాలన్‌పూర్-అబు రోడ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఐషర్ ట్రక్కు ఇన్నోవా కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది, దీంతో సంఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది. గుజరాత్‌లోని అమీర్‌గఢ్ – ఇక్బాల్‌గఢ్ మధ్య ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదం ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుజరాత్ పోలీసులు మృతులందరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం అమీర్‌గఢ్ ఆసుపత్రికి తరలించారు. శివ్‌గంజ్‌కు చెందిన ముగ్గురు, పింద్వారా, అబు రోడ్‌కు చెందిన ఒక్కొక్కరు ఈ ప్రమాదంలో మరణించినట్లు భావిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకువచ్చిన ట్రక్కు.. ఇన్నోవా కారును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. గాయపడిన ముగ్గరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం తరువాత, సంఘటన స్థలంలో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ ఘటనతో రహదారిపై భారీ ట్రాఫిక్ స్తంభించింది. కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. ఫలితంగా దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
అమీర్‌గఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం తర్వాత నిందితుడు ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిర్లక్ష్యం, రాంగ్ రూట్ లో ట్రక్కు నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..