Rajasthan: మహిళల భద్రతపై సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రాజస్థాన్ మంత్రిని తొలగింపు.. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ బీజేపీ

|

Jul 21, 2023 | 11:21 PM

రాజస్థాన్‌లో రాజకీయాలు మరింతగా వెడెక్కాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి రాజేంద్ర గూఢాను పదవి నుండి తొలగించారు. అయితే రాజస్థాన్ ప్రభుత్వంలో పౌర రక్షణ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ..

Rajasthan: మహిళల భద్రతపై సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రాజస్థాన్ మంత్రిని తొలగింపు.. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ బీజేపీ
Rajasthan Cm - Minister
Follow us on

రాజస్థాన్‌లో రాజకీయాలు మరింతగా వెడెక్కాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి రాజేంద్ర గూఢాను పదవి నుండి తొలగించారు. అయితే రాజస్థాన్ ప్రభుత్వంలో పౌర రక్షణ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజేంద్ర గూడా అసెంబ్లీలో సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. అసెంబ్లీలో మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతూ సొంత ప్రభుత్వంపైనే ప్రశ్నలు సంధించారు. మంత్రి ప్రకటనపై ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

అసెంబ్లీలో రాజేంద్ర గూడ ఏం చెప్పారు?

మణిపూర్‌లో కాకుండా మన ఇంట్లో జరుగుతున్న తీరును తెలుసుకోవాలని మంత్రి రాజేంద్ర గూడా తన సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రి రాజేంద్ర గూడ అసెంబ్లీలో సొంత ప్రభుత్వాన్ని ముట్టడి కారణంగా మహిళల భద్రతలో విఫలమయ్యామని అంగీకరించాలన్నారు. రాజస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిన తీరు, మణిపూర్‌కు బదులు, మన ఇంట్లో చూసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అయితే మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఉంచి ఊరేగింపు ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మణిపూర్‌ ఘటనను లేవనెత్తే బదులు ఆత్మపరిశీలన చేసుకోవడం ముఖ్యమని రాజేంద్ర గూడా అన్నారు. రాజస్థాన్‌లో మహిళల భద్రత కల్పించడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. అయితే రాజస్థాన్‌ సంగతి తర్వాత గానీ మన రాష్ట్రంలో మహిళలకు కల్పిస్తున్న భద్రతపై, హింసపై మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. దీనిపై రాజస్థాన్‌ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు.

ఇవి కూడా చదవండి

 


కాగా, తన సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మంత్రి రాజేంద్ర గూడా చేసిన ప్రకటనను నిందించే వీడియోను బీజేపీ షేర్ చేసింది. ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వీడియోను పంచుకున్నారు. ‘రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అకృత్యాల వాస్తవాన్ని ప్రభుత్వ మంత్రి రాజేంద్ర గూడా స్వయంగా చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(2) ప్రకారం.. మంత్రివర్గం సమిష్టి బాధ్యత ఆధారంగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రిజీ మాది కాకపోతే కనీసం మీ మంత్రి ప్రకటనను పట్టించుకోండి. హోం మంత్రిగా కనీసం శాంతిభద్రతల బాధ్యత అయినా నిర్వహించండి. మహిళా సాధికారత, కాంగ్రెస్‌ శైలి, ఇందిరాగాంధీ ప్రేరేపిత ప్రజాస్వామ్య స్వభావం.. రాజస్థాన్‌ ప్రభుత్వంలో ఒక మంత్రి నిజం మాట్లాడినందుకు తొలగించడం జరిగిందని, కాంగ్రెస్‌లో అవినీతిపరులకు, అబద్దాలకోరులకు మాత్రమే స్వాగతం పలుకుతారని బీజేపీ మండిపడింది. మంత్రి రాజేంద్ర గూడా తన ప్రభుత్వంపైనే టార్గెట్ చేయడంతో రాజస్థాన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రాజేంద్ర గూఢాను మంత్రి పదవి నుంచి తప్పించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి