
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రియుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సంచిలో ప్యాక్ చేసి పొరుగువారి ఇంట్లో పడేశాడు. మరుసటి రోజు ఉదయం, ఇంటి యజమాని మేల్కొన్నప్పుడు, ఆమె సంచి బయట పడి ఉంది. లోపల ఏముందో అని సంచి తెరిచిన వెంటనే షాక్ అయ్యారు. లోపల రక్తంతో తడిసిన శరీరం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేవలం నాలుగు గంటల్లోనే హత్య మిస్టరీ వీడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జితేంద్ర సింగ్ అలియాస్ రాహుల్, తన స్నేహితురాలు బబితా శర్మను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. జితేంద్రను విచారించినప్పుడు, అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఈ సంఘటన శాస్త్రి నగర్‌లో జరిగింది. మంగళవారం (డిసెంబర్ 23) ఉదయం, ఒక ఇంటి బయట ఒక సంచి పడి ఉండటం కనిపించింది. ఇంటి యజమాని మున్నీ దేవి షాక్ అయ్యింది. ఆమె తన అద్దెదారునికి ఫోన్ చేసింది. వారు సంచి తెరిచి చూడగా ఒక మహిళ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళను బబితా శర్మగా గుర్తించారు. బబితను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే ప్రశ్న ఇప్పుడు పోలీసులకు ఎదురైంది.
సహాయం కోసం ఒక స్నిఫర్ డాగ్‌ను రప్పించారు. ఆ కుక్క పొరుగు ఇంటి చుట్టూ పదే పదే తిరుగుతుండటం పోలీసులకు అనుమానం వచ్చింది. దర్యాప్తులో ఆ ఇల్లు జితేంద్ర సింగ్ అనే వ్యక్తికి చెందినదని తేలింది. అతను ఇటీవల ఆ ఇంటిని అమ్మేశాడు. అక్కడ ఎవరూ నివసించడం లేదు. పోలీసులు వెంటనే జితేంద్రను అరెస్టు చేశారు. అతన్ని కఠినంగా విచారించినప్పుడు, తన నేరాన్ని అంగీకరించాడు.
సుభాష్ కాలనీలో నివసిస్తున్న జితేంద్ర, బబిత ఇద్దరూ స్నేహితురాలు. కొంతకాలంగా ఆమెతో ఆర్థిక వివాదం ఉంది. ఆమె డబ్బుల కోసం నిత్కయం వేధిస్తోంది. దీని కారణంగా, ఈ ఇంటిని అమ్మేశాడు. అయినా నాబబితతో విసుగు వచ్చి.. ఆమెను ఇంట్లోనే చంపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఇల్లు అమ్మేడంతో ఎవరూ అనుమానించరనుకుని బబితను అదే ఇంట్లో జితేంద్ర హతమార్చాడు. ఈ సంఘటన డిసెంబర్ 21న జరిగింది.
డిసెంబర్ 21న నేను బబితను ఈ ఇంటికి పిలిచి, పదునైన ఆయుధంతో ఆమె మెడ, తలపై కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. తర్వాత ఆమె మృతదేహాన్ని ఎలా పారవేయాలో ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. మృతదేహాన్ని ఒక సంచిలో ప్యాక్ చేశాడు. కానీ దానిని ఎక్కడ పడవేయాలో తెలియదు. ఆ తర్వాత, రాత్రి చీకటిని ఆసరాగా చేసుకుని, మున్నీ దేవి ఇంటి బయట ఆ సంచిని విసిరేశాడు. పోలీసులు విచారణ కోసం వచ్చినప్పుడు, ఎవరూ అనుమానించకుండా ఉండటానికి అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం నిందితుడు రాహుల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని విచారణ కొనసాగుతోంది. బాలిక కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. మరిన్ని దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇంతలో, హత్య జరిగినప్పటి నుండి ఆ ప్రాంతం మొత్తం భయానక వాతావరణం నెలకొంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..