Rajasthan: రాజస్థాన్ ప్రభుత్వ భారీ ఆలోచన..30 కోట్ల ఔషధ మొక్కల పంపిణీకి ప్రయత్నాలు

|

May 29, 2021 | 7:41 PM

Rajasthan: రాజస్థాన్ ప్రభుత్వం 30 కోట్లకు పైగా ఔషధ మొక్కలను పంపిణీ చేయడానికి భారీ ఆలోచన చేస్తోంది. ఇందుకోసం రాజస్థాన్ అటవీ శాఖ నర్సరీలు వేలాది ఔషధ మొక్కలను అభివృద్ధి చేస్తున్నాయి.

Rajasthan: రాజస్థాన్ ప్రభుత్వ భారీ ఆలోచన..30 కోట్ల ఔషధ మొక్కల పంపిణీకి ప్రయత్నాలు
Rajasthan
Follow us on

Rajasthan: రాజస్థాన్ ప్రభుత్వం 30 కోట్లకు పైగా ఔషధ మొక్కలను పంపిణీ చేయడానికి భారీ ఆలోచన చేస్తోంది. ఇందుకోసం రాజస్థాన్ అటవీ శాఖ నర్సరీలు వేలాది ఔషధ మొక్కలను అభివృద్ధి చేస్తున్నాయి. వీటిని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఘర్ ఘర్ ఔషాధి యోజనలో భాగంగా రాష్ట్రవాసులకు బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ మెగా పథకం రాష్ట్రంలో నివసిస్తున్న మొత్తం 1,26,50,000 కుటుంబాలకు (2011 జనాభా లెక్కల ప్రకారం) చేరుకోవాలని యోచిస్తోంది, తులసి, అశ్వగంధ, గిల్లాయ్, కల్‌మేగ్ అనే నాలుగు ఎంచుకున్న ఔషధ మూలికల మొక్కలను ఇంటింటికీ అందచేయడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకం ఐదేళ్ల వ్యవధిలో, ప్రతి కుటుంబానికి 24 మొక్కలను స్వీకరించడానికి అర్హత కల్పిస్తుంది. మొదటి సంవత్సరంలో ఎనిమిది మొక్కలతో మొదలై మొత్తం రాష్ట్రమంతా కలిపి 30 కోట్లకు పైగా మొక్కలు ఉంటాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ బడ్జెట్ ప్రకటనలో ఈ భారీ మొక్కల బహుమతి ప్రచారం ద్వారా మొక్కలు, ప్రజల మధ్య ప్రయోజనకరమైన సంబంధాన్ని పెంచడానికి ఉద్దేశించినట్టు చెప్పారు. ఈ మొక్కలు రాజస్థాన్‌కు చెందినవి. సాంప్రదాయకంగా ఆరోగ్య పదార్ధాలుగా, మూలికా ఔషధాలలో ఉపయోగించబడుతున్నాయి. ప్రచారంలో భాగంగా మొక్కలు వాటి సంరక్షణ, సరైన ఉపయోగం గురించి సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలు అందిస్తాయి.

“రాజస్థాన్ జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉంది మరియు అనేక ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఘర్ ఘర్ ఔషధి యోజన ఈ సహజ సంపదను పరిరక్షించడంలో సహాయపడుతుంది. అలాగే, ఆరోగ్యం కోసం వారి చుట్టూ ఉన్న మూలికలు, మొక్కల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయపడుతుంది” అని రాజస్థాన్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీయా గుహ అన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సహకరిస్తున్నాయి. ఈ పథకానికి అటవీ శాఖ నోడల్ విభాగం కాగా, భూస్థాయిలో తగిన విధంగా అమలు అయ్యేలా జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది.

ఐదేళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 210 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది, అందులో రాష్ట్రంలోని సగం గృహాల్లో 5 కోట్లకు పైగా మొక్కలను పంపిణీ చేయడానికి మొదటి సంవత్సరంలో రూ .34.4 కోట్లు ఖర్చు చేస్తారు. మరుసటి సంవత్సరం మిగిలిన కుటుంబాలకు సమాన సంఖ్యలో మొక్కలు పంపిణీ చేస్తారు. ప్రతి కుటుంబానికి ఒకేసారి ఎనిమిది మొక్కలు అందుతాయి, నాలుగు మూలికలలో రెండేసి మొక్కలు. ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి మొత్తం 24 మొక్కలు అందుతాయి. పంపిణీ ప్రక్రియ వర్షాకాలం నుండి ప్రారంభం కానుంది. బహుశా భారతదేశం యొక్క అతిపెద్ద ఔషధ మూలికల ప్రోత్సాహక కార్యక్రమం, రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఘర్ ఘర్ ఔషధి యోజన కార్యక్రమం కావచ్చు.

Also Read: PIL on Vaccination: మాకూ వ్యాక్సిన్ వేయాలి..మేము స్కూలుకు వెళ్ళాలి..కోర్టులో పిటిషన్ వేసిన 12 ఏళ్ల బాలిక!

PM-CARES For Children: కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం కొత్త పథకం.. పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు.. ఇంకా