కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ రాజస్థాన్ పర్యటనలో ఉండగానే అశోక్ గెహ్లాట్ సర్కార్‌పై మరోసారి తిరుగుబాటు ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్. బీజేపీ నేతలతో అశోక్ గెహ్లాట్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాజస్థాన్ లోని మౌంట్‌అబూకు చేరుకున్నారు రాహుల్‌గాంధీ. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రాహుల్ పర్యటన సమయం లోనే తిరుగుబాటు చేసి సచిన్ పైలట్ హైకమాండ్‌కు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. గెహ్లాట్‌తో రాజీ లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. సోనియాగాంధీని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పార్టీ చీఫ్‌గా భావించడం లేదని, వసుంధరారాజేను తన నేతగా ఆయన భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు సచిన్ పైలట్. బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా జైపూర్ నుంచి ఐదురోజుల పాటు యాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు.
కొద్దిరోజుల క్రితం అశోక్ గెహ్లాట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తే అదే పార్టీకి చెందిన మాజీ సీఎం వసుంధరా రాజే కాపాడారని అన్నారు అశోక్ గెహ్లాట్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..