శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

| Edited By:

Jul 24, 2020 | 4:26 PM

ప్రస్తుతం జ్వరం వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా కరోనా భయం పట్టుకుంటుంది ప్రజలకు. అంతేకాదు.. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే మాత్రం ఇక ప్రాణాలు అరచేత..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!
Follow us on

ప్రస్తుతం జ్వరం వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా కరోనా భయం పట్టుకుంటుంది ప్రజలకు. అంతేకాదు.. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే మాత్రం ఇక ప్రాణాలు అరచేత పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే.. వెంటనే ఆస్పత్రిలో చేరినప్పటికీ.. అక్కడ ఆక్సిజన్ ఉంటుందో లేదో అన్న విషయం తెలియదు. ఇక అంతకంటే ముందు ఆస్పత్రులు చేర్చుకుంటాయో లేదో కూడా అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు ఆస్పత్రుల పరిస్థితి అలా ఉంది. అయితే రాజకీయ నాయకులకు ఆ పరిస్థితి లేకున్నప్పటికీ.. కరోనా భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. అంతేకాదు ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే.

తాజాగా రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవ్వడంతో వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరారు.కథమార్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాబూలాల్ బైర్వాకు.. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, జ‌లుబు, జ్వ‌రం లాంటి క‌రోనా వైరస్ సంబంధిత ల‌క్ష‌ణాలు కన్పించాయి. దీంతో వెంటనే ఆయన జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. అంతేకాదు అనుమానం నివృత్తి చేసుకునేందుకు కరోనా టెస్టు చేయించుకుని.. చికిత్స తీసుకుంటున్నారు.

కాగా, ఎమ్మెల్యే బాబూలాల్ బైర్వా.. సీఎం గెహ్లాట్ వ‌ర్గంలో ఉన్న ఎమ్మెల్యే. గ‌త రెండు వారాలుగా ఇత‌ర ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఫెయిర్‌మంట్ హోట‌ల్‌లో ఉంటున్నారు.